Friday, 14 February 2014

Fight Bad Days ....


Do the work you LOVE





ప్రేమించే పని చేయలంటే గట్స్ ఉండాలిరా అబ్బాయి!
మనం చేసే పని మనకు నచ్చిందే అయితే 
మనసుకు ఉల్లాసాన్ని ఇచ్చేదే అయితే
ఆ కిక్కే వేరురా అబ్బాయి!
సమయం ఎప్పుడైపోతుందో తెలీదు
శరీరానికి అలసట అంటే తెలీదు 
సృజనాత్మకతయే ఆలంబనగా   
రోజూ చేసే పని లో ప్రయోగాలు చేస్తూ 
పరిపూర్ణత్వం వైపు నడుస్తుంటాం. 
ఎవ్వడేమంటున్నాడో
ఎవడు  పలకరిస్తున్నాడో  
ఎవడు పరిహసిస్తున్నాడో 
ఎవడు కలహిస్తున్నాడో
ఎవడు కలహిస్తున్నాడో 
ఎవడు కవ్విస్తున్నాడో 
ఎవడు కలవర పెడుతున్నాడొ
ఆలోచించడానికే సమయం దొరకదు 
చేసే పనిలో నిరంతరం 
ఓ మునిలా
ఓ ధ్యానిలా
ప్రాపంచిక లోకంతో 
లాభనష్టాల బేరీజుతో
ఏ లెక్క లేదన్నట్టు మునిగిపోవడమే 
చేతికి వచ్చే సంపాదన కన్నా
గుండె లో నిండే సంతృప్తి 
యావత్ లోకాన్నే నీ కాళ్ళకింద దాసోహం చేస్తుంది 
కాని అది అంత సుళువు కాదురా చిన్నా 
ఎక్కడ మొదలు పెట్టాలో తెలీదు
ఎవరి సహాయాలు ఉండవు
ఎవరి సూచనలు ఉండవు
లోకం నిన్ను గుర్తించేంత వరకు 
నీ ఆకలి, నీ అవసరాలు
నిరంతరం నీకు గుర్తు చేస్తూనే ఉంటాయి 
ఎవడు మనల్ని తక్కువగ చూస్తున్నాడో అనే
ఆత్మన్యూన్యత  అసలు నిదురే పోనియ్యదు 
ఎవడిని కలిసినా ఏ ఫంక్షన్ కి వెళ్ళినా
అవహేళనా జ్వాలలు గుచ్చుకుంటూనే ఉంటాయి 
నమ్ముకున్నవారికి బరువు అవుతున్నామేమో అన్న వ్యథ 
నిలువెల్లా కాలుస్తునే ఉంటుంది 
ఎదురు చూసే క్షణం నీదైనంతవరకు 
కలలు సాకరమై ఎదురుగా నిలిచేంతవరకు 
జీవితంతో ఫొరాడే ఓపిక, ఓరిమి
నీ ఆయుధాలుగా మలుచుకునే నైపుణ్యం ఉంటేనే
నీవు ప్రేమించే పని జీవితాంతం చేయడానికి సిద్ధపడు 
లేదా మనసు చంపుకొని నాలుగు రాళ్ళు సంపాదించేందుకు 
దొరికిన పని చేస్తూ ప్రతి క్షణం చస్తూ జీవించు...  

సినిమాని లాజికల్ గా ఆలోచిస్తూ చూడాలా????






                              సినిమా అనేది మనల్ని ఒక ఊహా లోకం లో ఉంచుతూ కొన్ని వాస్తవాల్ని కొన్ని అభూత కల్పనల్ని  మేళవించి ఆనందాన్ని, వినోదాన్ని, కొన్నిసార్లు విజ్ఞనాన్ని  అందిస్తుంది. 


వాస్తవానికి బయట ప్రపంచంలో ఎవరూ పాటలు ఫాడుకుంటూ నృత్యాలు చేయరు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఉండదు. అన్నీ లాజికల్ గా ఉండాలంటే కుదరదు. మన కలలబేహారులు సినిమాలు నిర్మించేవారు. 

 అవతార్ సినిమాలో లాంటి మానవ రూపమో జంతు రూపమో తెలియని వాళ్ళు రకరకాల విన్యాసాలు చేస్తుంటే  ఆహో  ఓహో  అంటూ ఎగబడీ చూస్తాం. హాలీవుడ్ సినిమల్లో లాజిక్ లు, అవాస్తవాలు వెతకం. ఎందుకంటే వాటిని ఆనందిచిండానికే ప్రాధాన్యత ఇస్తాం, విమర్శించటానికి మాత్రం కాదు.

 మిష్టర్ ఇండియా  సినిమాలో అనీల్ కపూర్ వాచీ చేసిన విన్యాసాలు కుర్చీనుండి దొర్లిపడీ మరీ ఆనందిచాం.  సోషియా ఫాంటసీ, సైంటిఫిక్ ఫాంటసీ అంటూ తరువాత తమాయించుకుంటాం. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా విడుదల అయిన మొదటి వారం రోజులు పిచ్చిముదిరి ఇలాంటి సినిమా తీసారని విమర్శకులు నాలుకలకి పనిచెప్పారు. కాని పటిస్టమైన  స్క్రీన్ ప్లే. చిరంజీవి ఈజ్ తో చేసిన నటన, శ్రీదేవి అందచందాలముందు అంతా ఔరా అని ఇదొక నూతన ప్రయోగం అని సర్టిఫికేట్ ఇచ్చారు. 

        2001 లో తీసిన అ బ్యూటిఫుల్ మైండ్  అనే సినిమా నోబుల్ బహుమానం పొందిన గణిత శాస్త్రజ్ఞుడు  జాన్ ఫోర్బ్స్ నాష్  జీవిత ఆధారంగా వచ్చిన సినిమా నాలుగు ఆస్కార్ అవార్డ్స్ పొందటమే కాకుండా మరో నాలుగు అంశాలలో ఆస్కార్ నామినేషన్ కూడా పొందింది. దీoట్లో హీరో కి కనబడేవారు ఇతరులకి కనబడరు. అమెరికా గూడచారి  సంస్థ తనకు అతి ముఖ్యమైన పని అప్పచెప్పారని భావిస్తుంటాడు. తనకు కనబడే పాత్రలు ఎవరికీ కనబడవు. స్కీజోఫేనియా అనే వ్యాధి తో ముడిపడిన ఇతని పాత్ర అందరికీ విస్మయం కలిగిస్తుంటుంది.


           ఇంచుమించు ఈ సినిమా ప్రేరణ తో తీసిన వన్ నేనొక్కడినే రోటీన్ సినిమాలకు కాస్త భిన్నంగా ఉంది. ఈ సినిమా మీద భారీ అంచనాలుండటం, వన్  నేనొక్కడినే అని టైటిల్ పెట్టడం తో  ఇతర అభిమానుల మధ్య అనవసర పోటీ లాంటి ఆలోచనలు కలిగించడం తో  ఈ సినిమా మొదటి రోజు చాలా భయంకరమైన టాక్ వచ్చింది. మేం తీసుకున్న  టికెట్ లలో ఒకటి ఎక్కువ అవడంతో దానిని  వదిలించుకోడానికి    చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. 

     ఎవరు ఏమనుకున్నా విభిన్నతలను, ప్రయోగాలను మెచ్చుకునే సహృదయత, కళాభిమానం ఉన్న ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చుతుంది. ప్రతీ సీన్ లో రిచ్ నెస్, చివరి వరకు స్టోరీ లో జతచేయబడుతున్న అంశాలు ప్రేక్షకుడ్ని ఆలోచింపచేస్తుంది. దర్శకుడి శ్రమ, తల్లిదండ్రులగురించి మహేష్ బాబు పడే వేదన మంచి సెంటిమెంట్ పండిస్తుంది. 


 ఒక్కసారి లాజిక్కులకు పోకుండా అర్థం చేసుకోదానికి ప్రయత్నిస్తూ చూడండి. పక్కవాడు ఫాలో అవుతున్నాడో, అర్థం కాక హేళన చేస్తున్నాడో పట్టించుకోకుండా  ప్రతీ క్షణాన్ని, ప్రతీ సీన్ ని  అనందించండి.  

 కొంత నిడివి తగ్గించబోతున్నారు కాబట్టి  ఈ సినిమా మరో వారం రోజుల్లో  నెమ్మదిగా మంచిటాక్ వస్తుంది. మహేష్ బాబు నటన అందరికీ నచ్చుతుంది. అవసరం లేని రెండుపాటలు కూడా తీసేస్తే ఇంకా మంచిది.  ప్రయోగాలు చేసే టప్పుడు మసాలా ఫార్ములా ల గురించి ఆలోచించకూడదు.  ఇదే ఏ హిందీ సినిమా  కాని ఇంగ్లీష్ సినిమా కాని అయివుంటే తెగ సంబరపడిపోతూ సర్టిఫికేట్స్ ఇచ్చేవారు చాలామంది 

Wednesday, 25 December 2013

LIFE LESSONS FROM TEACHINGS OF JESUS CHRIST


             
   నేను నాలుగవ తరగతి నుండి ఏదవతరగతి చదుతున్న రోజుల్లో డాబాగార్డెన్స్ లో అద్దె ఇంట్లో ఉండేవాళ్ళం. ఇంటి ఓనర్స్ క్రిష్టియన్స్. మమ్మల్నికూడా వాళ్ళ పిల్లలతో ఇంచుమించు సమానంగా చూసేవారు. జోసెఫ్ మామయ్యగారు, కోకిలామణి ఆంటీ ..వారితో పాటు ప్రతీ రోజూ కీర్తనలు, బైబిల్ చదవడం ప్రతీ ఆదివారం చిత్రాలయ థియేటర్ ఎదురుగా ఉన్న చర్చి కి వెళ్ళడం  అలవా అలవాటు అయింది.

క్రిష్టమస్ సందర్భం గా జీసస్ బోధనలు నుండి నేర్చుకోవలసిన ఒక పది పాఠాలు..

LIFE LESSONS FROM   TEACHINGS OF JESUS CHRIST 

1.  LOVE OTHERS  AS YOU LOVE YOURSELF:

                  ఈ వాక్యం బాగా ఆలోచిస్తే దీంట్లో రెండు విషయాలు ఉన్నాయి.  ఒకటి ఇతరులను ప్రేమించడం. రెండూ అంతకు ముందు మనల్ని మనం ప్రేమించడం. నేడు జీవితం లో అనేకమంది ఎదుర్కుంటున్న సమస్యలకి మూలకారణం తమపై తమకు ప్రేమ లేకపోవడం. ప్రేమ అంటే ఆశించడం కాదు అంగీకరించడం. మనల్ని మనం పూర్తిగా అంగీకరించినపుడు మనలో లోపాలపై ధృష్టి పెట్టం. మనలో ఉన్న లోపాలను , మంచి విషయాలను సమానంగా అంగీకరిస్తాం. ఆత్మన్యూన్యతా భావం అనేది మన దగ్గరకు రాదు. తనను తాను ప్రేమించే వ్యక్తి ఇతరులను గౌరవించగలడు, అభిమానించగలడు ఇతరులకు  ప్రేమను పంచగలడు.  తనలో తాను ఒక ఆనందం లాంటి స్వర్గాన్ని సృష్టించుకోగలడు. తనను తాను ప్రేమించుకున్నట్లే ఇతరులను ప్రేమించమంటారు జీసస్ .. ఇతరులను ప్రేమించేటపుడు వారినుండి ఏమీ ఆశించం . ఎప్పుడైతే ఇతరులనుండి ఆశించమో వారిలో లోపాలపై ధృష్టి పెట్టం. ఎదుటివారిని ప్రేమించే టపుడు మనలో అహాన్ని పూర్తిగా విసర్జించగలం.  

2. PRIDE GOES BEFORE FALL: 
     
           పతనానికి ముందు అహం నడుస్తుంది. అహంకారం అన్ని ఇబ్బందులకు మూల కారణం. అహంతో ఉన్న వ్యక్తి ఇతరులను పట్టించుకోడు. తనకు అన్ని తెలుసనే మొండిపట్టుదలతో ఉంటాడు. తెలివితక్కువ  నిర్ణయాలు  తీసుకొని బోర్లాపడతాడు.  తనను తాను తగ్గించుకొనేవాడు హెచ్చింపబడతాడు అని జీసస్ చెప్పింది అదే.  వినయం, అణుకువ పైకెదిగేవారి లక్షణాలు. అహం అనేది పతనమయ్యేవారి లక్షణం.  కోరుకొండ సైనిక్ స్కూల్ బిల్డంగ్ బయట ఒక మంచి కొటేషన్ రాసి ఉంటుంది. ..The bow bends more shoots the Arrow surer....

3. PRACTICE FORGIVENESS: 

           " love your enemies, bless those who curse you, do good to those who hate you, and pray for those who spitefully use you and persecute you.."  నీ శతృవులను ప్రేమించుము, నిన్ను శపించేవాళ్ళను ఆశిర్వదించుము, నిన్ను ద్వేషించేవారికి మంఅచి చేయుము, నిన్ను మోసగిస్తూ ఉప్యోగించేవాకోసం ప్రార్థించుము.    జీసస్ చెప్పిన మాటల్లో ఒక అద్భుతమైన మాట.  దీనిని మనం కాని పాటించినట్లైతే ప్రపంచంలో పగ ప్రతీకారాలుండవేమో.   ఆఖరికి  బరబ్బానైనా విడిచిపెట్టండి కాని యేసుని శిలువెయ్యండి అన్న ప్రజలను క్షమిస్తూ వారు ఏమి చేస్తున్నారో వారికి తెలియదు అని వారిని క్షమించే జీసస్ హృదయాన్ని అర్థం చేసుకుంటే మనం ఎదుటివారితో జివించాల్సిన విధానం తెలుస్తుంది. తెలిసినవారితోనే కాదు ముక్కు మొఖం తెలియని ఫేస్ బుక్ మితృలతో కారాలు మిరియాలు నూరుతూ కామెంట్స్ రాసే మన సోదరులును క్షమించేద్దాం.  

4. AS YOU SOW, SO YOU REAP: 

  మన మనస్సు అనేది ఒక క్షేత్రం లాంటిది ఏ విత్తనం నాటుతామో అదే ఫలం లభిస్తుంది. మంచి ఆలోచనలు చేసే మనస్సు ఎల్లప్పుడూ  పరిశుద్ధంగా ఉంటుంది. పరిశుద్ధమైన మనస్సు వలన పరిశుద్ధమైన ఆత్మ కలుగుతుంది. మనాలోచన మంచి జీవితానికి దారితీస్తాయి. మనస్సు ను నియత్రించాలంటే ఆలోచనలను నియత్రించడమే.   you sow a thought, you reap  an action, you sow an action you reap a habit, you sow a habit you reap a character, you sow a character you reap your destiny.  

5. NEVER JUDGE:

       జీసస్ చెప్పిన అన్ని మాటలలో ముఖ్యమైనది  ఎదుటి వారు ఇలాంటి వారు  అలాంటి వారు అని నిర్ణయాలు చేయవద్దని. మార్క్స్ ట్వైన్ అంటాడు దేవుడు మనల్ని నిర్ణయించడానికి వంద సంవత్సరాలు ఆగుతాడు కొన్ని క్షణాల్లో ఎదుటివారు ఇలాంటి వారు అలాంటివారు అని తీర్పులు చెప్పడానికి మనం ఎవరమని.  ప్రతీ వ్యక్తి తన పరిస్థితులబట్టి, అవకాశాలబట్టి ప్రవర్తిస్తుంటాడు. వారు ఇలాంటి వారు అని నిర్ణయాలు చేయడం వలన అనవసర ఇక్కట్లు తెచ్చుకోవడమే గాక. ఇతరులను అంచనా వేస్తున్నకొద్దీ  వారిని మన మనసునుండి  దూరం చేసుకుంటాం 

 6. HAVE A HEART OF CHILD

   ఎల్లప్పుడు పసి హృదయాలను కలిగిఉండమని జీసస్ చెబుతాడు. పసి వాళ్ళకు ప్రతీ విషయం అద్భుతంగా కనబడుతుంది. అందరూ చాలా గొప్పవారిగా కనబడతారు. గతం గురించి లేదా భవిష్యత్తు గురించి చింత గాని ఆందోళన గాని ఉండదు ఎల్లప్పుడు వర్తమానం లోనే జీవిస్తారు. ఎవరి పై అకారణ కోపాలు కాని ద్వేషాలు కాని పెట్టుకోరు.  పసి  మనస్సులకు దేవుని  రాజ్యంలో ప్రవేశం ఉంటుంది. పసి వారి మనస్తత్వం ఉన్న వారు అందరిని ప్రేమించగలుగుతారు. 

7.  THE POWER OF ASKING: 

      భగవంతుని రాజ్యంలో ఉన్న ప్రతీ విషయం లో అందరికీ హక్కు ఉంటుంది. కాని దానిని పొందేందుకు మానవ ప్రయత్నం అవసరం.  అడుగుడి ఇవ్వబడును, కోరుడి పొందబడును, తట్టుడి  తెరవబడును  అని జీసస్ చెబుతారు.  అడగందే అమ్మైనా అన్నం పెట్టదు అనే నానుడి ఉంది. అది కోరుకునే ముందు, దానిని అడిగే ముందు దానిని పొందేందుకు కావల్సిన అర్హత, కృషి చేయాల్సి ఉంటుంది. 

8.  BELIEVE AND ACHIEVE : 

   విశ్వాసమే భగవంతుడు. నమ్మకం, విశ్వాసం కలిగి ఉండటమంటే భగవంతుని ఉనికి పట్ల నమ్మకం కలిగిఉండటమే. మనసా వాచా కర్మేణా చేస్తున్న పని పట్ల, నమ్మిన విలువల పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. నమ్మకమే విజయానికి దోహదకారి. సముద్రం నడిచివచ్చిన జీసస్ పీటర్ చుసి తాను నడవాలనుకుంటాడు రెండు అడుగులు నడిచిన తర్వాత మునిగిపోతానేమో అని సంశయపడతాడు మునిగిపోతుంటాడు. పీటర్ ని చేతి సహాయం తో లేపి నీపై నీకున్న విశ్వాసమే నిన్ను నీటిపై ణడిపించినడి, నీ అపనమ్మకమే నీటిలో ముంచినది అని జీసస్ అంటారు.  సంశయాత్మ వినాశ:  అన్న గీతాబోధన అదే...   A faith of mustard  seed will move away the mountains..  ఆవగింజంత విశ్వాసం పర్వతాలను కదిలిస్తుంది.

9. PRAYER IS THE KEY TO HARVEST: 

       త్రికరణ శుద్ధిగా చేసే ప్రార్థన నిన్ను అన్ని బంధాలనుండి విముక్తిన్ని చేస్తుంది. ఒక రైతు నిరంతరం వ్యవసాయం చేస్తేనే పంట ఎటువంటి కలుపు మొక్కలకి , చీడలకు బలి కాకుండా చేతికి వస్తుందో మనం కూడా మన చేస్తున్న పనులకు తగిన ఫలితం పొందాలంటే నిరంతరం భగవంతున్ని ప్రార్థించాలంటారు జీసస్. " నేను ఈ రోజు చేయాక్సిన పనులు చాలా ఉన్నాయి అందుకే ఈ రోజు ఒక గంట ఎక్కువగ ప్రార్థిస్తాను " అంటారు గాంధీజీ . ప్రార్థన మనతో భగవంతునికి గల బంధాన్ని, విశ్వాసాన్ని పెంపొందింప చేస్తుంది. ఆత్మ, పరమాత్మ తో లయం అవకాశాన్ని మరింత దృఢవంతం చేస్తుంది. 

10.  SERVE THE MANKIND TO SERVE THE GOD

    సేవకుడు కానివాడు బోధకుడు కాలేడు.  చివరి రాత్రి విందుకు ముందు జీసస్ తన అనుచరుల కాళ్ళు కడుగుతాడు.  తోటివారిని సేవించడం ద్వారా భగవంతుడిని చేరుకోవచ్చని తెలియచేస్తాడు. ఎదుటి మనిషి లో గల దైవాన్ని  సేవ ద్వారా తెలుసుకోవచ్చు. SERVANT LEADERSHIP  అనే కొత్త మేనేజ్ మెంట్ ధోరణి ఈ భావం నుందే పుట్టింది.  మథర్ థెరిస్సా  మానవసేవ అనే మార్గాన్ని ఎంచుకోవడం ద్వారా పునీతురాలైంది.. సెయింట్ థెరిసాగా మారగలిగింది. నీ సంపాదనలో కొంతభాగాన్ని అన్నార్తులకొరకు . దీనులకొరకు వెచ్చించగలిగితే దేవునిరాజ్యం ఈ భూమి మీదే ఏర్పడుతుంది.

                   విశ్వమానవ సౌభ్రాతృత్వభావనకు, శాంతి సాధన, ప్రేమకొరకు బోధించిన జీసస్ భావనలు మతం తో సంబంధం లేకుండా ప్రపంచశాంటి కోరేవారంతా పాటించినట్లైతే  జగమంతా క్రిస్మస్ వెలుగులు నిండుతాయి,  మానవత్వ పరిమళాలు పరిఢవిల్లుతాయి. మనిష్యల మనస్సుల ప్రేమపుష్పాలు విప్పారుతాయి. వికసిస్తాయి. 

    WISH  YOU A HAPPY AND MERRY CHRISTMAS  ..

Thursday, 12 December 2013

Must know Founders


Must Know :-

*Founder of Apple Computers – Steve Jobs
*Founder of Artificial Intelligence – John McCarthy
*Founder of Bluetooth – Ericsson
*Father of Computer – Charles Babbage
*Father of ‘C’ Language – Dennis Ritchie
*Founder of Email – Shiva Ayyadurai
*Founder of Google – Larry Page and Sergey Brin
*Founder of Internet – Vint Cerf
*Father of ‘Java’- James Gosling
*Father of JQuery – John Resig
*Founder of Keyboard – Christoper Latham Sholes
*Founder of Linux – Linus Torvalds
*Founder of Microsoft – Bill Gates and Paul Allen
*Founder of Mobile Phones – Martin Cooper
*Founder of Mouse – Douglas Engelbart
*Founders of Oracle – Ed Oates, Larry Ellison, Bob Miner
*Founder of Php – Rasmus Lerdorf
*Founder of USB – Ajay V.Bhatt
*Founder of WWW – Tim Berners-Lee
*Founder of Yahoo – Jurry Yang and David Filo

Wednesday, 11 December 2013

Samuel Reshevsky, age 8, defeating several chess masters at once in France, 1920!

After the tournament...he was never heard from again.


Tuesday, 10 December 2013

WHERE IS HAPPINESS???

A few tips to be happy


1. Forgive yourself


2. Forgive others


3. Don't Focus on your problems


4. What you give to others you get them back


5. Always Be busy


6. Remember your blessings and achievements


7. Develop a healthy habit


8. You are quiet unique, be thankful and be proud to be what you are


9. Be optimistic......
 

Sunday, 8 December 2013



Rise and shine! Morning time just became your new best friend. Love it or hate it, utilizing the morning hours before work may be the key to a successful and healthy lifestyle. That's right, early rising is a common trait found in many CEOs, government officials, and other influential people.

This post originally appeared on Forbes.

Margaret Thatcher was up every day at 5 am, Frank Lloyd Wright at 4am, and Robert Iger, the CEO of Disney, wakes at 4:30am (just to name a few). P


I know what you're thinking—you do your best work at night. Not so fast. According to Inc. Magazine, morning people have been found to be more proactive and more productive. In addition, the health benefits for those with a life before work go on and on. Let's explore five of the things successful people do before 8am.P

Exercise

I've said it once, I'll say it again. Most people that work out daily, work out in the morning. Whether it's a morning yoga session or a trip to the gym, exercising before work gives you a boost of energy for the day and that deserved sense of accomplishment. Anyone can tackle a pile of paperwork after 200 ab reps! Morning workouts also eliminate the possibility of flaking out on your cardio after a long day at work. Even if you aren't bright eyed and bushy tailed at the thought of a 5am jog, try waking up 15 minutes early for a quick bedside set of pushups or stretching. It'll help wake up your body, and prep you for your day.

Map Out Your Day

Maximize your potential by mapping out your schedule for the day, as well as your goals and to dos. The morning is a good time for this as it is often one of the only quiet times a person gets throughout the day. The early hours foster easier reflection that helps when prioritizing your activities. They also allow for uninterrupted problem solving when trying to fit everything into your timetable. While scheduling, don't forget about your mental health. Plan a 10 minute break after that stressful meeting for a quick walk around the block or a moment of meditation at your desk. Trying to eat healthy? Schedule a small window in the evening to pack a few nutritious snacks to bring to work the next day.

Eat a Healthy Breakfast

 

We all know that rush out the door with a cup of coffee and an empty stomach feeling. You sit down at your desk, and you're already wondering how early that taco truck sets up camp outside your office. No good. Take that extra time in the morning to fuel your body for the tasks ahead of it. It will help keep your mind on what's at hand and not your growling stomach. Not only is breakfast good for your physical health, it is also a good time to connect socially. Even five minutes of talking with your kids or spouse while eating a quick bowl of oatmeal can boost your spirits before heading out the door.

Visualization

These days we talk about our physical health ad nauseam, but sometimes our mental health gets overlooked. The morning is the perfect time to spend some quiet time inside your mind meditating or visualizing. Take a moment to visualize your day ahead of you, focusing on the successes you will have. Even just a minute of visualization and positive thinking can help improve your mood and outlook on your work load for the day.P

Make Your Day Top Heavy

We all have that one item on our to do list that we dread. It looms over you all day (or week) until you finally suck it up and do it after much procrastination. Here's an easy tip to save yourself the stress—do that least desirable task on your list first. Instead of anticipating the unpleasantness of it from first coffee through your lunch break, get it out of the way. The morning is the time when you are (generally) more well rested and your energy level is up. Therefore, you are more well equipped to handle more difficult projects. And look at it this way, your day will get progressively easier, not the other way around. By the time your work day is ending, you're winding down with easier to dos and heading into your free time more relaxed. Success!

 

Friday, 6 December 2013

విమర్శలను ఎదుర్కోవడం ఎలా?



విమర్శలను ఎదుర్కోవడం  ఎలా?


       ప్రపంచం లో అనేకమంది సతమతమౌతున్న సమస్యల్లో  విమర్శించబడటం అనేది చాలా ముఖ్యమైనది.  విమర్శకుల బారిన పడకుండా ఉన్న మానవుడు ఎవరూ లేరంటే  అతిశయోక్తి కాదు.  అందుకే  ఐనిస్టీన్ అంటారు విమర్శింపడనివాడెవడైనా ఉన్నాడంటే  వాడు ఏమీ చేయకుండా ఉన్నవాడైయుంటాడు అని.  నలుగురూ నడిచే దారిలో కాకుండా  తనకంటూ ఒక ప్రత్యేకత ఉందని నమ్మి  తనకు నచ్చిన దారిలో నడవాలని ప్రయత్నించే ప్రతి ఒక్కరికీ ఈ విమర్శలు తప్పవు.
   విమర్శలకు జడిసి  మనసు చంపుకొని  తాము చేయాలనుకున్నవి చేయలేక జీవచ్చవాలై జీవించే వారు నూటికి తొంభైకి పైగా ఉంటారని పరిశీలకులు చెబుతున్నారు
కాని ఒక్కసారి  ఇతరులను విమర్శించేవారి మానసిక వైఖరి ఎలా ఉంటుందో తెలుసుకుంటే  వారు తమలో తామే  ఎంతటి అసంత్రుప్తితో జీవిస్తున్నారో తెలుసుకుంటే వారి పట్ల కోపం కన్నా జాలి పుట్టి వారికి మంచి మనసు ప్రసాదించమని  వారి తరుఫున దేవుణ్ణి మనం ప్రార్థిస్తాం.   నమ్మరు కదా ..... సరే  మీ కోసమే   ...........   ఈ   ఆర్టికల్......
విమర్శించే వారి  మానసిక స్థితిః

* విమర్శించే వారి గతంః  సాధారణంగా ఇతరులను అకారణంగా విమర్శించేవారి గతం అనేక బాధలతో కూడి ఉంటుందని మానసిక విశ్లేషికుల అభిప్రాయం.   వారి జీవితంలో తరుచూ తల్లిదండ్రుల దూషణలకు, బందు మిత్రుల హేళనలకు గురై యుంటారు.
* విమర్శించే వారు  పొగడ్తలకోసం అర్రులు చాస్తూ ఉంటారుః  వీరు ఇతరులనుండి  పొగడ్తలు ఎక్కువగా ఆశిస్తుంటారు. తమకు సరియైన గుర్తింపులేదని తరుచూ అంతర్గతంగా బాధపడుతుంటారు. తాము చేసిన చిన్న చిన్న విషయాలను గోరంతలు కొండంతలు చేస్తూ  తమ గొప్పలు తరుచూ చెప్పుకుంటూ ఉంటారు.  నార్సిస్టిక్ పర్సనాలిటీ దిజార్డర్  అనే  మానసిక సమస్యతో మధన పడుతుంటారు.
* విమర్శించే వారు  మన స్నేహాన్ని, మన ప్రేమను ఎక్కువ మొత్తంలో  ఆశించినవాలై యుంటారు. ఎప్పుడైతే మనం వారు ఆశించినంత  సన్నిహితంగా మెలగటం లేదో మన  ద్రుష్టిని  ఆకర్షించేందుకు విమర్శిస్తుంటారు.
* విమర్శించే వారికి భావోద్వేగాలు సమతౌల్యం చేసుకొనే అవకాశం ఉండదుః   ప్రతీ వారికి తమ యొక్క  కోపాన్ని గాని,  భావోద్వేగాలను  వ్యక్తపరచేందుకు, సమతౌల్యం చేసుకొనేందుకు ఎదో ఒక వీలు అవకాశం ఉంటుంది.  వీటినే EMOTIONAL VENTILATORS ఆంటాం.  వీరికి  ఈ అవకాశం  లేకపోవడాం వలన ఎవరు దొరుకుతారా వారిపై  తమ కడుపులో ఉన్న  అక్కసు కక్కేద్దామని ఎదురుచూస్తుంటారు.  ఎదుటివారి మీద కోపం కన్న  తమ కడుపులో కుళ్ళు బయటకు పంపడానికే  అకారణం గా విమర్శిస్తుంటారు.
*విమర్శించే వారికి భవిష్యత్ పై ఆశ చాలా తక్కువగా ఉంటుందిః  తరుచూ  ఇతరులను అకారణంగా విమర్శించే వారికి తమ భవిష్యత్ మీద ఆశ ఉండదు. నిరాశావాదం తో క్రుగిపోతుంటారు.  ఇతరులు తమను ఎక్కడ అధిగమిస్తారో అనే భయం తో తరుచూ మధన పడుతుంటారు.
విమర్శించేవారు  అతి ఎక్కువ అసూయ, అతి తక్కువ ఆత్మ గౌరవం కలిగియుంటారు. ః  ఇతరులను విమర్శించే వారు తమపై తమకు తక్కువ అబ్జిప్రాయం కలిగియుంటారు.  తరుచూ మనలాంటి వాళ్ళకి అది సాధ్యమా, మన బ్రతుకులకి అలా వీలవుతుందా అనే  మాటలతో మనల్ని కూడా వాళ్ళలాగే  దద్దమ్మలగా లెక్క కట్టి మాట్లాడుతుంటారు. ఇతరులమీద అసూయ ఇక్కువ మొత్తంలో కలిగియుంటారు.
    విమర్శలను  ఎదుర్కోవడం ఎలా?
  రాముడులాంటి వాడే  విమర్శలను ఎదుర్కోలేక సీతను త్యజించాడని రామాయణంలో చెబుతారు.  ఈ సారి  మిమ్మల్ని ఇతరులు  విమర్శిస్తున్నపుడు వాటిని వ్యక్తిగతంగా తీసుకోకుండా వారి బలహీన మానసిక స్థితిని అర్థం చేసుకోడానికి ప్రయత్నించండి.  ఈ క్రింది విషయాలు గుర్తుంచుకోండి.
1. మీరు ఏదైనా ఒక పని చేసేటపుడు ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తే  వారు  ఆ రంగంలో  లేదా ఆ పనిలో అనుభవం ఉన్నవారా? కాదా? ప్రశ్నించుకోండి. ప్రతీ దద్దమ్మ చెప్పే కబుర్లు పట్టించుకోనవసరం లేదని గుర్తించండి.  వికెట్లమధ్య ప్రుగెత్తడం చేతకాక 38 సార్లు రన్ అవుట్  అయిన సంజయ్  మంజ్రేకర్  సచిన్  టెండుల్కర్ ని  ఎక్కడ అవకాశం దొరికినా విమర్శిస్తుంటాడు.  అంత పోటుగాడు అయితే  ఆడి చూపించవచ్చుగదా....
2. మన లక్ష్యం, మన కల ఎప్పుడూ   ఇతరుల విమర్శకన్నా బలంగా ఉండాలి.;   ఇతరుల విమర్శకు జడిసి మనం చేస్తున్న పనిని వదిలివేసామంటే మన లక్ష్యం  చాలా బలహీనంగా ఉందన్నమాట. ఎవరైతే స్థిరమైన ఖచ్చితమైన బలమైన కోరిక కలిగిఉంటారో  వారు  ఇతరులు కడుపుమంటతో చేసిన విమర్శలను పట్టించుకోరు.
3. మనల్ని విమర్శించే వారు మనం చేస్తున్న పనిలో లోపాలు, తప్పులు గురించి చెప్పేటపుడు  ఎలా చేస్తే, ఏమి చేస్తే బాగుంటుందో   అని వారిని ఒక సారి  ప్రశ్నించండి.  వారి వద్ద సమాధానం ఉండదు సరికదా  అక్కడనుండి పలాయనం చిత్తగిస్తారు.   ఈ సారి ప్రయత్నించి చూడండి.
4.విమర్శకులకు దూరంగా ఉండండి లేదా వారిని దూరంగా ఉంచండి;    ఎలాంటి వారైన విమర్శల బాణాల వాడిని  వేడిని  తట్టుకోలేరు.  వారిని దూరంగా ఉంచడం  లేదా మనం దూరంగా ఉండటం అన్నిటికన్నా  మంచిది.  రోడ్డుమీద దారి పొడుగునా ముళ్ళు ఉన్నప్పుడు  వాటిని పీకి వేస్తూ  సమయం దుర్వినియోగం చేసుకోవద్దు.  మంచి  చెప్పులు వేసుకుంటే  పోలా.
5.ఇంకా వివరాలు, చిట్కాలు  అనవసరం మౌలా నజిరుద్దీన్ కి  ఎదురైన ఒక అనుభవం చూడండి.  విమర్శకుల గురించి,  మనకు బాగా అర్థం  అవుతుంది.
    ఒక సారి  మౌలా నజిరుద్దీన్  తన కుమారుడి తో కలసి సంతకు వెళ్ళి  ఒక గాడిద కొన్నాడట్.  ఎందుకంటే  ఆ రోజుల్లో  గాడిదలే  ప్రధాన ప్రయాణ సాధనాలు.  గాడిద కొని  దాని పైన తన కుమారుడిని కూర్చోపెట్టి ప్రక్కన్ నడుస్తూ వస్తున్నాడట.  కొంతమంది  అది చూసి  ఏమయ్యా  నజిరుద్దీన్  మీ అబ్బాయికి  గారాబం చేస్తున్నావు. పిల్లడికి కష్టం అంటే తెలీక పోతే  రేపు పెద్దయ్యాక సమస్యలు ఎదుర్కుంటాడు. నీవు చేస్తున్న ఏమీ బాగో లేదు అని విమర్శించారట్.   దానితో నజీరుద్దీన్  పిల్లవాడిని దించి  తను  కూర్చొని ప్రయాణం సాగించాడట.  దార్లో కొద్ది మంది అది చూసి  ఏమయ్యా నజిరుద్దీన్  నీకు ఏమైనా బుర్ర ఉందా  చిన్న పిల్లవాడిని నడిపిస్తూ  ఇంత ఎదిగావు  ఆ మాత్రం తెలీదా అని విమర్శించారట.  దాంతో నజిరుద్దీన్  తాను మరియు తన కొడుకు ఇద్దరు కలసి గాడిద మీద కూర్చొని ముందుకు సాగారు. దార్లో కొద్ది మంది చూసి  అసలు మీలో మానవత్వం ఉందా  ఇద్ద్రరు కలసి కూర్చుంటే అది మొయ్యగలదా? మీలో సైతాన్  ప్రవేశించాడా అని శాపనార్థాలు మొదలెట్తారట.  దాంతో నజిరుద్దీన్  వెంటనే  తాను  తన కుమారుడు  గాడిద పైనుండి దిగి  ఇద్దరు కలసి  గాడిద తో  పాటు నడవడం మొదలెట్టారట.  దార్లో  మరికొందరు చూసి  ఏమయ్యా  నజిరుద్దీన్  ఏమి మనిషివయ్యా   ఉన్న అవకాశం  ఉపయోగించుకోడం చేతకాక పోతే ఎలాగయ్యా?  గాడిద కొని దానిని నడిపిస్తే అది ఎందుకు కొన్నావయ్యా?  దానిమీద కూర్చొని ప్రయాణం చెయ్యవచ్చుకదా  అని విమర్శల వర్షం మొదలెట్టారట. ఇప్పుడు  నజీరుద్దీన్  దగ్గర ఒకటే  అప్షన్ ఉంది.  దానిని  తండ్రి కొడుద్కులిద్దరూ మొయ్యడం  లేదా  గాడిద ను వదిలి పారిపోవడం.
         ఇతరులను సంత్రుప్తి పరచాలని ప్రయత్నిస్తే  ఎవరినీ సంత్రుప్తి పరచలేము.   ఇతరులు మనల్ని విమర్శిస్తున్నారంటే  మనలో ఏదో  విషయం  ఉందన్నమాట.  కాబట్టి  విమర్శలకు  వెఱవకుండా మనం ఎంచుకున్న రంగం లో  జైత్రయాత్ర మొదలెడుదామా.
ఆల్ ది బెస్ట్


 

నేనింతే.................



డియర్ ఫ్రెండ్స్ ,
   సినిమాలు చూస్తుంటారా?   వినోదం కోసమా... కాలక్షేపం కోసమా..... ఏదో స్నేహితులతో కలిసి  ఆనందిద్దాం  అని వెళ్తుంటారా?    
   సినిమా కేవలం వినోదం కోసమే అనే ఆలోచన మీకు ఉంటే దానిని పక్కన పెట్టండి.......ఈ రోజే   పూరి జగన్నాథ్  తీసిన సినిమాల డి.వి.డి లు   కొనండి....  ఒక్కో సినిమా   ఒక్కో వ్యక్తిత వికాస నిఘంటువు..  హీరో ల పాత్రల చిత్రీకరణ, వ్యక్తిత్వ నిర్మాణం  పరిశీలించండి....జీవితాన్ని ఎలా జీవించాలో..... మన వ్యక్తిత్వాల్ని ఎలా మెరుగు పరుచుకోవాలో ......కళ్ళకు కట్టినట్టు, అరటి పండు ఒలిచి చేతిలో పెట్టినట్టు వివరిస్తాడు....   మనుష్యుల్ని, సమాజాన్ని ఇంతచక్కగా అవగాహన చేసుకొని సినిమా మాధ్యమం కూడా వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగించవచ్చని నిరూపించిన అతి తక్కువ మంది దర్శకులలో  పూరి జగన్నాథ్  అగ్రగణ్యుడు అని చెప్పడం లో అతిశయోక్తి ఏ మాత్రం కాదు...   ప్రతి మనిషికి సామాజిక భాధ్యతకన్నా  వ్యక్తిగత భాద్యత ముఖ్యం అని కెమేరామేన్ గంగ తో రాంబాబు సినిమాలో పవన్ కల్యాణ్ పాత్ర తో చెప్పిస్తే....  కెరీర్ ముఖ్యమా  కుటుంబం ముఖ్యమా  వర్క్ లైఫ్ బాలెన్స్ ఎలా చెయ్యాలో  నలిగిపోతూ  కెరీర్ కోసం  కుటుంబాన్ని త్యాగం చేస్తే  అది తప్పు ..కెరీర్ కన్నా  కుటుంబమే ముఖ్యం, మానవ సంబంధాలే ముఖ్యం అని అమ్మ, నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలో రవితేజ పాత్ర ద్వారా  చెప్పించారు పూరి జగన్నాథ్ ......ఇక బిజినెస్ మేన్ చిత్రం లో అయితే ఎన్ని మేనేజ్మెంట్ పాఠాలున్నాయో ఒక పెద్ద పుస్తకమే రాయ వచ్చు.
        ఇవన్నీ చిత్రాలు ఒక ఎత్తు అయితే... నిలువెత్తు వ్యక్తిత్వానికి ఒక నమూనా గా..  ఒక మనిషి లక్ష్యం అనేది ఎలా ఏర్పాటు చేసుకోవాలి ...ప్రేమించే పని కోసం ఎలాంటి త్యాగాలు చేయాలి ..ఎన్ని అవాంతరాలు వచ్చిన, ఆకర్షణలు వచ్చినా   చలించకుండా  ఎలా సాధించాలి?  తనను ప్రేమించేవారు వారి కాళ్ళపై వారు నిలబడేటట్టు, వారి సమస్యలను వారికి వారే వ్యక్తిగత భాధ్యత ద్వారా ఎలా తొలగించుకునేటట్టు చేయాలి  ఇలాంటి విషయాలను ఆదర్శం గా ఆవిష్కరించిన   చిత్రం   నేనింతే.........

                           *** నీకిష్టమైన పని చెయ్****  


       సినిమా  మొదలవడమే  సినిమా హీరో రవితేజ కల కంటూ ఉంటాడు.  నూటికి ఎనభై శాతం మంది తాము చేస్తున్న పనిని ఏ మాత్రం ఇష్టపడకుండా  తిట్టుకుంటూ,  రాజీ పడుతూ, మనసు చంపుకొని,  అయిష్టం గా చేస్తుంటారు. చేస్తున్న పని ఏ మాత్రం సంతృప్తి చెందకుండా  మెకానికల్ జీవిస్తుంటారు.  ఇష్టమైన పని చేయడానికి  చాలా కష్టపడాలి.  బ్రతుకు అదే కావాలి, ఊపిరి అదే కావాలి, కలలో కూడా దాని గురించే ఆలోచించాలి.  బలమైన కోరికలే కలలు గా రూపాంతరం చెందుతాయని ప్రముఖ మానసిక శాస్త్రవేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్  చెబుతాడు.   తెలుగు సినిమా ఫీల్డ్ లో మంచి దర్శకుడు కావాలని రవితేజ కోరిక, జీవిత లక్ష్యం.   అది సాధించాలంటే ఒక రోజులో  జరిగేది కాదు. దానికోసం నిరంతరం శ్రమిస్తుండాలి. ప్రతీ ఆలోచన తన లక్ష్యానికి సంబంధించినదై ఉండాలి.  ఏ సినిమా చేస్తున్నవు అని హీరోయిన్ ని అడిగితే  తాను  చరణ్  సినిమా అంటుంది. దానికి రవితేజ ఓ మా రాజమౌళీ గారిదా అంటాడు.  ఏ రంగం లో ఉన్నావో ఆ రంగానికి  చెందినవారితో  నిన్ను నీవు అసోషియేట్ చేసుకోవాలి.

                          *****  లైఫ్  అంటేనే పెయిన్ ****

             జీవితమంటేనే ఒక పోరాటం. పోరాటానికి సిద్ధం గా ఉండాలి.  హీరోయిన్  ఒక డాన్సర్.  డ్రెస్ వేసుకోడానికి ఇష్టపడకపోతే  ఆమె మీద కోప్పడతాడు.  జీవించడానికి, డబ్బుకోసం  ఆమె  పడే  మానసిక   సంఘర్షణ  చూసి  విలువలకు ,  పరిస్థితులకు  ఆమె  పడుతున్న  వేదన చూసి  ఇష్టపడతాడు.     సాధారణంగా ఆడవారిని  తమ  పరిస్థితుల్ని  పట్ల కాస్త జాలి,  వారి పట్ల కాస్త సానుభూతి చూపించి  చాలామంది  దగ్గరవడానికి ప్రయత్నిస్తారు.  కాని హీరో జాలి కాని,  సానుభూతి  కాని  చూపించడు.  నీ సమస్యల్ని నీకు నీవుగ పరిష్కరించుకో అని హీరోయిన్ కి, ఆమె అక్కకి నిఖార్సుగా చెబుతాడు.  ఎదుటివారి స్వీయభాధ్యతను పదే పదే గుర్తుచేస్తూ వారి కాళ్ళ పై వారు నిలబడాలని ఆశించడం నిజమైన వ్యక్తిత్వం ఉన్నవారి లక్షణం.