Friday, 6 December 2013

SAVE PAWANISM

                             


ఇదంతా కేవలం కల్పనలే కదా
ఏదో నాలుగు మాటలు ఫొగేసి
కాలం గడపటానికి
చేస్తున్న అవాస్తవ ప్రచారాలే కదా
విరిసిన మల్లెపూవులాంటి నీవు 
ఈ బురదలో దొర్లాలనుకుంటున్నావా?
ఎత్తైన శిఖరం లాంటి నీ వ్యక్తిత్వాన్ని
మరగుజ్జులతో కలిసి
మంటపెట్టాలనుకుంటున్నావా?
ప్రతి ఒక్కరికి వ్యక్తిగత భాధ్యత ఉండాలని,  
సమాజంలో జీవించే అందరికీ 
సామాజిక భాధ్యత ఉండాలని
నీవు బల్ల గుద్ది చెబుతుంటే
పనీ పాటా లేకుండా
పైలా పచ్చీసుగా తిరుగుతున్న 
ఈ యువతరానికి
తమకే లక్ష్యం లేకుండా గమ్యమేదో, గమనమేదో తెలీక
గంగిరెద్దుల్లా, డూడూ బసవన్నల్లా   
బుర్రలూపుతున్న  
ఈ నవతరానికీ 
వేగుచుక్కలా, నవ చైతన్య దీపికలా
నీవు నిలబడతావని
కోటి ఆశలతో, క్రొంగొత్త కోరికలతో
ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూస్తున్న 
మాకు శరాఘాతం లా 
ఈ వార్తా కథనాలు ఏమిటి?
ఇదంతా ఒక అభూత కల్పన అయితే ఎంతబాగుణ్ణు
నీవు నిత్యం చదివే తత్వ శాస్త్రాలు
పాలు కు తేనెలా నీతో కలిసిన 
మాటల మాంత్రికుడు
నీ గురించి తెలుసుకునేందుకు 
నిత్యం నీవు చేసే ఆలోచనాలోచనలు
నీకు  ఈ బురదలో పడి దొర్లాలన్న
అభిప్రాయాన్ని మార్చుకునేలా చేస్తాయని
గుంపులో ఓ గోవిందయ్యలా, సంతలో సీతయ్యలా
నీవు నిలిచిపోకూడదని
వ్యక్తిగత సంస్కరణ మనుషుల్లో
వచ్చేవిధం గా ఒక సరిక్రొత్త విప్లవానికి, 
మానసిక పరివర్తనోద్యమానికి 
నీవు శ్రీకారం చుడతావని
ప్రపంచమంతటా పరిమళిస్తున్న 
పవనిజం  వేచిచూస్తుంది
నీవు ఏమి చేయలేకపోయినా పరవాలేదుకాని
నీవు నీలా అయినా నిలిచిపో
ఈ బురద గుంటల్లో మునిగితేలాలనే
కోరికని, అకాంక్షని మొగ్గలోనే తుంచుకో.... 
మలినమంటని ఓ ఆణిముత్యం లా
మా గుండేల్లో మిగిలిపో...
By Oscars School of Soft Skills -Kurnool.

Lessons of Life by Rudayard Kipling

జీవిత పాఠాలు తెలిపే కవితలు - :"If - by Rudayard Kipling"

  మీరంతా  " హ్యాపీ డేస్ " సినిమా చూసారా? అందులో ఒక కథానాయకుడు  నిఖిల్  ఇంగ్లీష్ మేడమ్ వెనుక పడతాడు. ఆమే  ఆ అబ్బాయికి  ఒక ఇంగ్లీష్  Poem   ఇచ్చి  నేర్చుకొని రమ్మంటుంది.  ఆ కవిత ఏమిటో?  ఆ కవిత ద్వారా ప్రతీ యువకుడు తెలుసు కోవలసిన జీవిత  పాఠాలేమిటో తెలుసుకుంటే అనేక మందికి ఉపయోగ పడుతుందేమో....   నేను డిగ్రీ  సెకెండియర్  లో  ఉన్నప్పుడు  మాకు ఈ Poem   ఉండేది. సారాంశం బట్టీ పట్టడమే తప్ప  అర్థం చేసుకోడానికి అంతగా ప్రయత్నించలేదు.
  జంగిల్ బుక్  ద్వారా ఎంతో ప్రాచుర్యం పొందిన రుడ్ యార్డ్ కింపింగ్  1895 లో  ఈ Poem   వ్రాసాడు. 1910 లో ముద్రించబడింది.  ఒక తండ్రి  తన కుమారుడికి  ఎలా జీవించాలో?  దాని వలన  వాడికి కలిగే ఫలితమేమిటో  ఈ  Poem   తెలియచేస్తుంది. ఒక మనిషి అనేవాడు ఎలా ఉండాలో, నాయకత్వ లక్షణాలు ఎలా ఉండాలో దీనిలో చెప్పబడింది.

ముందుగా  ఈ  Poem   ఏమిటో చూద్దాం.....
Ist Stanza 


IF you can keep your head when all about you
Are losing theirs and blaming it on you,
If you can trust yourself when all men doubt you,
But make allowance for their doubting too;
If you can wait and not be tired by waiting,
Or being lied about, don't deal in lies,
Or being hated, don't give way to hating,
And yet don't look too good, nor talk too wise:


తెలుసుకోవలసిన జీవిత పాఠాలుః    

1.  ఆత్మ విశ్వాసం - నమ్మకం;  ఇతరులకు నీ మీద నమ్మకం ఉండవచ్చు లేకపోవచ్చు లేదా నీలోనే లోపాలున్నాయని నిన్ను నిందించవచ్చు. నీ మీద ఇతరులకున్న నమ్మకం విశ్వాసం సడలిపోతుండవచ్చు.  కాని  ఎటువంటి పరిస్థితుల్లో నీ మీద నీకున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని విడిచిపెట్టవద్దు.  అసత్యాలతో, ద్వేషం తో నీపై ఇతరులు నిందించవచ్హు. ఎటువంటి పరిస్థుతుల్లో సహనాన్ని విడిచిపెట్టకుండా, అసహనానికి లోనుకాకుండా, నీలో ద్వేషానికి  చోటు ఇవ్వకుండా ఉండగలగాలి. అతి మంచివాడిగా కనబడవద్దు, అతి తెలివితేటలతో మాట్లాడవద్దు. 

II  nd Stanza  

 If you can dream - and not make dreams your master;
If you can think - and not make thoughts your aim;
If you can meet with Triumph and Disaster
And treat those two impostors just the same;
If you can bear to hear the truth you've spoken
Twisted by knaves to make a trap for fools,
Or watch the things you gave your life to, broken,
And stoop and build 'em up with worn-out tools: 


2. చెదరని సంకల్పం;   జీవితం గురించి కలలు  కను.  కాని కలల బేహారిగా  విహరించకు. ఆలోచించి పనులు చెయ్. కాని ఒట్టి ఆలొచనలతో  వాస్తవాలకు దూరంగా జీవించకు. 
ఓటమికి కృంగిపోవడం,  విజయానికి  ఉప్పోంగి పోవడం కాకుండా విజయాన్ని కాని  ఓటమిని గాని సమభావంతో స్వీకరించే తత్వాన్ని అలవరచుకో, నీవు పలికిన సత్యాలకు వక్రభాష్యాలు చేర్చి నిన్ను అందులో బలి చేసే  ఇతరుల  పన్నాగాలకు బలికాకు. జీవితాన్నే ఫణంగా పెట్టి సాధించిన విజయ సౌధాలు ఒక్కసారి కూలినా, ఆ శిధిలాల శకలాలతో నూతన విజయాలకు నాంది పలుకు . 

III  rd Stanza  
 
If you can make one heap of all your winnings
And risk it on one turn of pitch-and-toss,
And lose, and start again at your beginnings
And never breathe a word about your loss;
If you can force your heart and nerve and sinew
To serve your turn long after they are gone,
And so hold on when there is nothing in you
Except the Will which says to them: 'Hold on!'




3. ఓటమికి నిరాశ చెందకు;   ఓటమి అంటే ఉండే భయం   ఏ పని చేయడానికి  ముందడుగు వేయనీయదు. నీవు సాధించిన అన్ని విజయాలు  పెట్టుబడిగా పెట్టి, అవి పోయినా ఫర్వాలేదు  మొదలు నుండి మరలా జీవితం మొదలుపెట్టగలను అనే తెగువతో సాహస నిర్ణయాలు  తీసుకో. నీ ఓటమి గురించి ఎవరి వద్ద చర్చించకుండా ఓటమిని  మనసుకు పట్టించుకోకుండా సర్వం కోల్పోయినా సంకల్ప బలం తో నిగ్రహించుకుంటూ జీవించు.

IV th  Stanza 
 
If you can talk with crowds and keep your virtue,
Or walk with Kings - nor lose the common touch,
If neither foes nor loving friends can hurt you,
If all men count with you, but none too much;
If you can fill the unforgiving minute
With sixty seconds' worth of distance run,
Yours is the Earth and everything that's in it,
And - which is more - you'll be a Man, my son!


4. విలువల ప్రాతిపదిక  తో  జీవించు;   అతి  సాధారణ  జనాలతో  జీవిస్తున్నప్పటికీ   నీవైన విలువలను ఎన్నడూ  విడిచిపెట్టకు.   అలా అని గొప్పవారి తో స్నేహం చేసినప్పటికీ సాధారణ
ప్రజలతో  సంబంధాలను విడిచిపెట్టకు. నీ అగర్భ శతృవులైన, నీ గాఢ స్నేహితులైన నిన్నెప్పుడూ బాధపెట్టకలిగే  స్థితి కలిగించకు.  అందరితో కలిసి  ఉన్నప్పటికీ  నీ హద్దుల్లో నీవుండు.  నిమిషం లో  ఉండే ప్రతి  సెకెన్  విలువైనదిగా ఉపయోగించు. కాలం విలువైనదని గుర్తించు.  
        ఇలా నీవుండ గలిగితే నీకు కావల్సినవన్నీ కలిగియున్న నీదైన  ప్రపంచాన్ని పొందగలవు. మనిషి గా సంపూర్ణంగా తయారవ్వగలవు.
                              షుమారు వంద కు పైగా సంవత్సరాల క్రింద  కిప్లింగ్  చెప్పిన జీవిత పాఠాలతో కూడిన ఈ  Poem   ఈ నాటికి ఆచరణ యోగ్యం.  నాయకత్వ లక్షణాలకు ఒక కరదీపిక.  మన మనస్తత్వాల మార్పుకు, వ్యక్తిత్వాల నిర్మాణాలకు ఉపయోగమైన దీనిని ఆచరించగలమని నమ్ముతూ
 
Oscar School of Soft Skills -Kurnool.

Sunday, 20 May 2012

Life Lessons From Gabbar Singh Movie


 గబ్బర్ సింగ్   సినిమా చూసి ఆనందిస్తున్న తెలుగు ప్రేక్షకులు తమ తమ అభిరుచులమేరకు ఆ సినిమాలోని అనేక అంశాలను మెచ్చుకుంటున్నారు..  ఈ సినిమా ఫక్తు కమర్షియల్ సినిమా అని విమర్శించే వారు ఎప్పటిలాగే ఉన్నప్పటికీ   ఈ సినిమా లో తెలుసుకోవల్సిన, పరిశీలించవల్సిన మనో విశ్లేషణా  మరియు జీవితానికి ఉపయోగపడే అంశాల గురించి ఒక వ్యక్తిత్వ వికాస శిక్షకుడిగా నా అభిప్రాయలను నేను పరిశీలించిన అంశాలను తెలియచేస్తున్నాను. ఇంతకు ముందు బిజినెస్ మేన్ సినిమా లో మేనేజ్ మెంట్ అంశాలను ఎలాగైతే అభినందించారో అదేవిధంగా ఈ వ్యాసం మీకు ఆనందం కల్గిస్తుందని ఆశిస్తున్నాను.
SIBLING RIVALRY:    ప్రతీ కుటుంబంలో  ఇద్దరు మగ పిల్లలుంటే  తండ్రి లేదా తల్లి ఒకరివైపు ఎక్కువ అభిమానం చూపుతూ   ఒకరి వలన రెండో వాడు చెడిపోతున్నడనే విమర్శించడం వలన అటువంటి తల్లిదండ్రుల ప్రవర్తన పిల్లల పై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో  ఈ సినిమా ఒక చక్కని ఉదాహరణ.  గారాబం చెయ్యబడ్డవాడు ఆ ప్రేమను దుర్వినియోగం చేస్తాడు. రెండోవాడు తనని తాను ఒక విలన్ గా ప్రొజెక్ట్  చేసుకునే అవకాశం ఉంటుంది. పిల్లలను తరుచూ పోల్చడం, ఒకరి వలన మరొకరు పాడవుతున్నాడనే విమర్శ  ఒకరిలో ప్రతీకారన్ని, మరొకరిలో తాను ఏమి చేసినా పర్వాలేదనే మొండితనాన్ని ఏర్పరుచుతుంది.
ACCEPTANCE OF CHILD AS HE IS;    పిల్లలని వారి అభిరుచులను వారి ఆసక్తులను ప్రతీ తండ్రి లేదా తల్లి వారు ఎలా ఉంటున్నారో అలానే  అంగీకరించాలి.  తమ అభిప్రాయాలకు భిన్నంగా ప్రవర్తిస్తుంటే వారిని అర్థం చేసుకోవాలి. అంతే కాని వారిని హాస్టల్ లో ఉంచితే  దూరంగా ఉండటం వలన తల్లిదండ్రుల ప్రేమకు దూరమై కుటుంబం పట్ల నిరాసక్తత ఏర్పరచుకోవచ్చు.  ఎవరు  ఎవరు లా ఉన్నా జీవించడం ముఖ్యం, బ్రతకడమ్ ముఖ్యం. కలిసి ఉండటమ్ ముఖ్యం.    తమ అభిప్రాయాలను వ్యక్తపరుచుకోవడం ముఖ్యం.  ముసలి కాలం ఆప్యాయత  ఎలా మనకు అవసరమో  పిల్లలకి ఆ వయస్సులో అభిమానం ఆప్యాయత, ప్రేమ చాలా అవసరం.
OEDIPUS  and ELECTRA COMPLEX:     ఈ సినిమాలో గుర్తించాల్సిన విషయాలు రెండు   హీరో పవన్ కల్యాణ్  ఇడిపస్ కాంపెక్స్ అనే స్వభావం కలిగి ఉంటే హీరోయిన్  ఎలెక్ట్రా కాంప్లెక్స్  అనే  స్వభావమ్ కలిగి ఉంటారు.   తల్లి పై   తీవ్రమైన అభిమానం కలిగిఉండి ఆమె ప్రేమకోసం  తహతహలాడటం, తనమీద వ్యామోహం పెంచుకొని వయ్యారాలు పోతున్న స్త్రీ మీద మోజు చూపకపోవడం,   గౌరవంగా ఒక పద్ధతిగా ఉండే  శృతిహసన్  పై  అభిమానం పెంచుకొని  ఆమె అభిప్రాయానికి గౌరవించడం  ఇవన్నీ   ఇడిపస్ కాంప్లెక్స్   స్వభావం అయితే తండ్రి బలహీనతలను కూడా గౌరవిస్తూ   తండ్రి కోసం తన అభిప్రాయాలను కూడా కాదనుకోవడం  శృతిహసన్ ఎలెక్ట్రా కాంప్లెక్స్ స్వభావం కలిగిఉంటుంది.
FAMILY IS IMPORTANT:    దూరంగా ఉన్నా, దగ్గరగా ఉన్నా  కుటుంబం,   కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు చాల ముఖ్యం . ఇదే విషయాన్ని శృతి హసన్ పాత్ర ద్వారా దర్శకుడు చెప్పిస్తాడు.   చివరికి అన్నదమ్ముల మధ్య  చిన్న చిన్న వైరుధ్యాలున్న  ఒకరినొకరు క్షమించుకోవడం   పిల్లల సుఖాలే తల్లిదండ్రుల లక్ష్యం అని కోట శ్రీనివాస్  పాత్ర  ద్వారా  చెప్పిస్తాడు.

Thursday, 3 May 2012

Management Lessons-Pirates Of Silicon Valley


ఆధునిక సాంకేతిక ప్రపంచాన్ని శాసించినవాళ్ళు ఇద్దరున్నారు.
స్టీవ్ జాబ్స్
టెక్నాలజీ అంటే ఏమిటో తెలిసినవాళ్ళకి ఈ పేరు తెలియకుండా వుండే అవకాశమే లేదు. ఆయన పేరు తెలియకపోయినా కనీసం ఐపాడ్, ఐఫోన్ అనే పేర్లు విని వుండకపోతే ఆ వ్యక్తిని సాంకేతిక నిరక్షరాస్యుడని (technology illiterate) ప్రకటించేయచ్చు.
బిల్ గేట్స్
కంప్యూటర్ల గురించి తెలియని సాంకేతిక నిరక్షరాస్యుడికి అయినా ప్రపంచంలోనే అత్యంత ధనికుడుగా బిల్ గేట్స్ సుపరిచితుడు. ఇక కంప్యూటర్ అంటేనే విండోస్ అనేంతగా చొచ్చుకుపోయిన ఆపరేటింగ్ సిస్టం గురించి కొత్తగా చెప్పాలిసిన పనేలేదు.
ఈ ఇద్దరు వ్యక్తులు లేకపోతే మనం కొన్ని తరాల వెనకపడిపోయి వుండేవాళ్లమేమో. కొన్ని వందల సంవత్సరాల తరువాత మానవ పరిణామక్రమం గురించి ఎవరైనా రాయాల్సివస్తే – మనిషి నిప్పుని కనిపెట్టడం, చక్రాన్ని కనిపెట్టడం, కంప్యూటర్‌ని కనిపెట్టడం కీలక సంఘటనలుగా పేర్కొంటారేమో. ఇంతగా మనల్ని ప్రభావితం చేసిన ఒక సాంకేతిక విప్లవానికి కారణమైన ఆ ఇద్దరి జీవితాలలో జరిగిన సంఘటనలే కథగా ఒక సినిమా తీస్తే? సరిగ్గా ఈ ఆలోచనతో రూపుదిద్దుకున్న చిత్రమే – “పైరేట్స్ ఆఫ్ సిలికాన్ వ్యాలీ”.
నిజానికి స్టీవ్ జాబ్స్, బిల్ గేట్స్ ల జీవితాలు ఒకదానికొకటి పెనవేసుకోని వున్నా ఈ ఇద్దరి మధ్య ఎన్నో వ్యత్యాసాలున్నాయి. ముఖ్యంగా వారిద్దరి నాయకత్వ లక్షణాలను (leadership qualities), మేనేజ్మెంట్ స్టైల్ లను పరిశీలిస్తే ఆ వైవిధ్యాలు ప్రస్ఫుటమౌతాయి. వారిద్దరి మనస్తత్వాలలో కూడా ఎంతో భేదం వుంది. స్టీవ్ జాబ్స్ ఒక కాళాకారుడి లాంటి మనస్తత్వం వున్న వాడైతే బిల్ గేట్స్ ఒక వ్యాపారవేత్త మనస్తత్వం కలవాడు. స్టీవ్ ఆలోచనలు వేదంత సిద్ధాంతాల మీద ఆధారపడితే బిల్ ఆలోచనలు చాలా వరకు ఆర్థిక సిద్ధాంతాల మీద ఆధారపడతాయి. ఉదాహరణకి చూడండి –  మొన్నటికి మొన్న స్టీవ్ జాబ్స్ చనిపోయినప్పుడు ఇంటర్నెట్‌లో వెల్లువలా వచ్చిన సంతాప సందేశాలను చూడండి. ఫేస్‌బుక్‌లోనూ, ట్విటర్‌లోనూ ఎక్కడ చూసినా ఆయన ఆత్మశాంతి కోరుతూ సందేశాలే. ఒక టెక్నాలజీ కంపెనీ అధిపతికి ఇంత మంది అభిమానులా అని ఆశ్చర్యపోయేంతగా వున్నాయా సందేశాలు. మరి బిల్ గేట్స్ కి కూడా అంత మంది అభిమానులు వున్నారా?
బహుశా వుండకపోవచ్చు. ఇంటర్నెట్‌లో వెతికితే బిల్ గేట్శ్ మీద, మరీ ముఖ్యంగా విండోస్ మీద కోకొల్లలుగా జోక్స్ దొరుకుతాయి. టెక్నాలజీ విప్లవాన్ని వీరిద్దర్లో ఎవరెంత ప్రభావితం చేశారు అనేది పక్కన పెడితే ప్రజాభిమానంలో మాత్రం బహుశా స్టీవ్ జాబ్స్ కే ఎక్కువ మార్కులు పడతాయేమో. ఎందుకంటే బిల్ గేట్స్ మన అవసరాలను గుర్తించి వ్యాపారం చేశాడు, స్టీవ్ జాబ్స్ తన మనసుకు నచ్చేవి తయారు చేసి వాటితో వ్యాపారం చేశాడు.
సరిగ్గా ఇదే విషయాన్ని వివరిస్తూ సాగే సినిమా “పైరేట్స్ ఆఫ్ సిలికాన్ వ్యాలీ”.  ఒక సినిమాగా ఇది స్టీవ్ జాబ్స్ గురించి కథ అని అనిపించినా నిజానికి ఇది ఇద్దరి కథ. ఎందుకంటే బిల్ గేట్స్ లేకపోతే స్టీవ్ జాబ్స్ లేడు. స్టీవ్ జాబ్స్ లేకపోతే బిల్ గేట్స్ వుండేవాడు కాదు. వీరిద్దరి జీవితాల గురించి తెలుసుకోవడానికి, సాంకేతిక విప్లవాలకు నాంది పలికిన ఏపిల్, మైక్రోసాఫ్ట్ కంపెనీల పుట్టుక గురించీ వాటి అభివృద్ధి గురించి తెలుసుకోడానికి ఈ సినిమా తప్పకుండా చూడాలి. అలాగని ఇది కేవలం టేక్నాలజీ గురించిన కథే కాదు. ఇద్దరు వ్యాపారవేత్తల మధ్య నడిచే పోటీకారణంగా వారి మధ్య పుట్టే స్నేహాలు, వైరాలు, ద్రోహాలు అన్ని కలిసి ఈ సినిమాని బోర్ కొట్టే జీవితచరిత్రలా కాకుండా ఒక ఎంటర్టైనింగ్ కథలా వుంటుంది.
ఈ సినిమాలో మేనేజ్మెంట్ పాఠాలు వెతికితే రెండు ముఖ్యమైన విషయాలు గుర్తించవచ్చు. అందులో మొదటిది స్టీవ్ జాబ్స్ దార్శినికత (Vision). తాను సాధించబోయే సాంకేతిక విప్లవం తనకి ముందే తెలుసా అన్నంత ధీమాగా వుండే స్టీవ్ జాబ్స్ ని చూస్తే ఆశ్చర్యంతో పాటు, ఆరాధన కూడా కలుగుతుంది. అనూహ్యమైన నాయకత్వ లక్షణాలతో అతను టీమ్ ను ముందుకు నడిపించే విధానం చూస్తే అభినందించాలనిపిస్తుంది. మామూలుగా ఉద్యోగస్తులతో సరదాగా వుండే స్టీవ్ జాబ్స్ పని విషయానికి వచ్చేసరికి ఎంత కఠినంగా వ్యవహరించేవాడో చూస్తేకానీ తెలియదు. ఇది కాక కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా ఆఫీసుకి రావటం, ఇంటర్వ్యూకి వచ్చిన వ్యక్తితో అవసరంలేని వ్యక్తిగతప్రశ్నలు అడిగి ఖంగారు పెట్టడం ఇలాంటివి ఎన్నో వున్నాయి. ముఖ్యంగా తన కంపెనీలోనే ఏపిల్ టీమ్ ని మ్యాక్ టీమ్ ని విడగొట్టి వారిద్దరి మధ్య దాదాపు కొట్టుకునే పరిస్థితి తీసుకురావటం చూస్తే అది తెలియక చేస్తున్న పిచ్చి పనా లేక ఇందులో కూడా ఏదైనా కార్పొరేట్ పాఠం వుందా అని ఆశ్చర్యపోతాం. నిజానికి చాలా Leadership పాఠాలలో చెప్పే Create and Manage Conflict for result అన్న సూత్రాన్నే స్టీవ్ జాబ్స్ పాటిస్తుంటాడు.
మరో పక్క (ఈ సినిమాలో) బిల్ గేట్స్ ఈర్షాద్వేషాలు, పన్నాగాలు చూస్తుంటే ఈ సినిమాలో విలన్ గేట్సే నేమో అని అనిపించకమానదు. వాస్తవానికి ఇదే మనం నేర్చుకోవాల్సిన రెండో మానేజ్మెంట్ పాఠం. కాంపీటీషన్ ఎక్కువైనప్పుడు జరిగే Unethical Practises కి ఇవి చిన్న ఉదాహరణలు మాత్రమే. అలాంటి అనైతికమైన పోటీని తట్టుకోడానికి తెలివైన మేనేజర్ ఎలాంటి ప్రయత్నాలు చేస్తాడో కూడా స్పష్టం చేస్తాడు స్టీవ్ జాబ్స్.
సినిమా చివరి భాగంలో స్టీవ్ జాబ్స్ బిల్ గేట్స్ ని పట్టుకోని నిలదీస్తాడు. తన టెక్నాలజీని దొంగిలించి విండోస్ తయారు చేసారని అభియోగం మోపుతాడు. అప్పటి దాకా చాలా ప్రశాంతంగా వున్న గేట్స్ ఆవేశంగా అరిచి – “నేను చేసింది దొంగతనం అయితే నువ్వు జిరాక్స్ దగ్గర చేసింది ఏమిటి?” అని అడుగుతాడు. ఆ ప్రశ్న తరువాత నిజంగా గేట్స్ విలనేనా అన్నప్రశ్న మనలో మిగిలిపోతుంది. బహుశ అందువల్లే ఈ సినిమాకి “పైరేట్స్ ఆఫ్ సిలికన్ వ్యాలీ” అని పేరు పెట్టారేమో.
కొత్తగా పుట్టుకొచ్చే టెక్నాలజీలను adopt చేసుకోవడంలో చాలా వరకు కంపెనీలు వెనకబడుతుంటాయి. ఆ విషయానికి వస్తే మార్పుకి ఎప్పుడూ విముఖత వుండనే వుంటుంది. ఈ సినిమాలో ఉదాహరణ చూస్తే జిరాక్స్ కంపెనీలో ఒక టీమ్ మౌస్ ని కనిపెడితే దాన్ని చూసిన జిరాక్స్ యాజమాన్యం “చచ్చిన ఎలకలా వుందని” తిరస్కరిస్తుంది. అదే పరిజ్ఞానాన్ని అందుకున్న స్టీవ్ జాబ్స్ మాకింటోష్ కంప్యూటర్ల ద్వారా ఆ పరికరాన్ని మనకి పరిచయం చేశాడు. సరిగ్గా ఇదే విధంగా మొదటిసారి ఏపిల్ పరికరాన్ని తయారు చేశాక స్టీవ్ జాబ్స్, అతని మిత్రుడు దాన్ని హేవ్లెట్ పేకార్డ్ దగ్గరకు తీసుకెళ్తే దాన్ని వాళ్ళు తిరస్కరిస్తారు. అదే ఏపిల్ ఈ రోజు ఏమైందో మనందరికీ తెలుసు. ఇదంతా ఎందుకు తెలుసుకోవాలంటే అప్పట్లో పేరు మోసిన కంపెనీలు సైతం కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకోవడంలో విఫలమయ్యాయి. కానీ ఆ టెక్నాలజీనే నమ్ముకున్న స్టీవ్ జాబ్స్ రాబోయే తరాల చరిత్రనే తిరగరాశాడు. అది కేవలం ఒక Visionary కి మాత్రమే సాధ్యం.

Saturday, 31 March 2012

KUNG FU PANDA- MANAGEMENT LESSONS


సినిమాల ద్వారా చదువులు చెప్పచ్చని అనగానే అదేదో సీరియస్ సినిమాలతోనే సాధ్యం అని అనుకోకూడదు. సరదాగా సాగిపోయి, బోలెడంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చే సినిమాల్లో సయితం ఎన్నో పాఠాలు వుంటాయి. ఎటొచ్చీ అవి తెలుసుకోడానికే కొంత ప్రయత్నం చెయ్యాలి. అలా సరదాగా సాగే పిల్లల సినిమా “కుంగ్ ఫూ పాండా” చిత్రంలో వున్న మేనేజ్మెంట్ పాఠాలను తెలుసుకునే ప్రయత్నమే ఈ వ్యాసం.
కుంగ్ ఫూ పాండా కథ చాలా మందికి తెలిసే వుంటుంది. Underdog తరహాలో సాగే ఈ కథలో పో (Po) అనే ఒక పాండా ఎప్పటికైనా కుంగ్ ఫూ యుద్ధం చెయ్యాలని కలలు కంటుంటుంది. అలా కలలు ఫలించి, ఒకరోజు అనుకోని విధంగా తాను ఎంతగానో ఆరాధించేFurious Five తో పోటీ పడి Dragon Warrior గా ఎన్నుకొబడుతాడు. అలా ఎన్నుకోబడ్డ ’పో’ అత్యంత భయంకరమైన టై లాంగ్ తో యుద్ధం చేసి నిజమైన వారియర్ గా నిలవడమే ఈ చిత్రం.
ఒకవిధంగా చూస్తే అయాచితంగా Dragaon Warrior గా మారిన పాండా ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడమే సినిమా కథ అని చెప్పవచ్చు. సరిగ్గా ఇలాగే చాలా సందర్భాలలో కొత్తగా ఉద్యోగంలొ చేరినవారికి ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడమే పరిక్షగా నిలుస్తుంది. అలాంటి వారికి ఉపయోగపడే పాఠాలు ఈ చిత్రమంతా వున్నాయి. అందుకే చాలా Induction Trainings లో ఈ సినిమాని ప్రదర్శిస్తారు. (ఈ మధ్య ఒక కాలేజీలో కొత్తగా చేరిన ఎం.బీ.యే. విద్యార్థులకు ఇదే సినిమా చూపించి అందులో పాఠాలను వారి కోర్సుకు అన్వయించి చెప్పాను.)
కుంగ్ ఫూ పాండాలో మేనేజ్మెంట్ పాఠాలు:
Desire and Belief
వీటి గురించి వివరించాల్సిన అవసరం లేకపోయినా వీటి గురించి ముందు చెప్పుకొవాల్సిన అవసరం వుంది. పాండాకి కుంగ్ ఫూ చెయ్యాలన్న బలమైన కోరిక వున్నా అది చెయ్యగలనన్న నమ్మకం లేకపోవటం వల్లే తండ్రి మాట వినే మామూలు “big fat panda” గా మిగిలిపోతాడు. ఆఖరుకు గుగ్గురువు ఊగ్వే (Tortoise Oogway) పాండాని డ్రాగెన్ వారియర్ గా నియమించినా ఆ విషయాన్ని నమ్మలేకపోతాడు. కానీ తండ్రి Secret Ingredients గురించి చెప్పిన తరువాత కలిగిన నమ్మకంతోనే Tai Lung మీద విజయం సాధిస్తాడు. అందుకే కోరిక దానికి అణుగుణంగా నమ్మకం విజయానికి మూల హేతువులు అవుతాయి.
Challenge the Challenges with Smile
గుగ్గురువు (Tortoise) ఊగ్వే పాండాని డ్రాగన్ వారియర్ గా ప్రకటించిన తరువాత ఎవ్వరూ ఆ విషయాన్ని నమ్మరు. ఆఖరకు పాండా కూడా ఆ విషయాన్ని నమ్మకపోవటం మనందరికీ తెలుసు. అయినా ఊగ్వే మీద నమ్మకం/గౌరవం వల్ల అయితేనేమీ, కుంగ్ ఫూ/Furious Five వల్ల అయితేనేమీ అక్కడే వుండిపోతాడు. అలా వుండిపోయిన పాండాని వెళ్ళగొట్టేందుకు, అతని చేతగానితనాన్ని నిరూపించేందుకూ షిఫూ, Furious Five అయిదుగ్గురు సభ్యులు ఎన్ని రకాలుగా పరీక్షలు పెట్టినా, అవమానించినా నవ్వుతూ నిలబడటం వల్లే పాండా చివరికి విజయాన్ని సాధిస్తుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే Hard Workతో కలిసిన Perseverance కి అపజయం వుండదు. ఇదే సందర్భంలో పాండాకి ఇష్టమైన తిండిని వాడుతూ ట్రైనింగ్ ఇవ్వడం Positive Reinforcement కి మంచి వుదాహరణ.
There is No Secret Ingredient
మొత్తం మీద నాకు బాగా నచ్చిన పాఠం ఇది. డ్రాగన్ వారియర్ కి ఏదో శక్తివంతమైన సహాయం Dragon Scroll ద్వారా లభిస్తుందని నమ్ముతుంది పాండా. తీరా అది చేతికి చిక్కాక అందులో ఏమీ లేదని నిరాశ పొందుతుంది. అదే విధంగా పాండా తండ్రి (Goose) Mr. Ping తయారు చేసే Secret Ingredient Soup విషయంలోనూ ఇలాంటి రహస్యం ఒకటి వుంటుంది. ఆ గుట్టు విప్పినప్పుడు Mr. Ping  చెప్పే మాటలు అమూల్యమైనవి. “The secret ingredient of the secret ingredient soup is NOTHING. You just got to believe that it is special.”  అంతే ఆ ఒక్క వాక్యం పాండా దృక్పధాన్ని మార్చేస్తుంది. Dragon Scroll ఏమీ లేకపోయినా తన ముఖం తనకే కనిపించిందన్న వాస్తవం తెలుసుకోని, శక్తివంతమైన సహాయం తనకి తనే అని తెలుసుకోని ధైర్యంగా Tai Lung తో పోరాటానికి సిద్ధపడతాడు. అదే అతని విజయానికి కారణం కూడా అవుతుంది.
ఈ విధంగా అనుకొకుండా పదవులలోకి వచ్చినవారు, కష్టమైన పని మొదలుపెడుతున్నవాళ్ళు నేర్చుకోని తీరాల్సిన పాఠాలను నేర్పిస్తుంది కుంగ్ ఫూ పాండా.

Tuesday, 27 March 2012

12 O CLOCK HIGH - MANAGEMENT LESSONS


మేనేజెంట్ పాఠాలు నేర్పించే సినిమాలలో  12 Angry Men  అత్యంత ప్రముఖమైనది అయితే, ఆ తరువాత చెప్పుకోదగ్గ చిత్రం 12 O Clock High. ఈ రెండు చిత్రాలు 12తో మొదలవటం కేవలం కాకతాళీయమే. పైగా రెండు చిత్రాలు Leadership కి సంబంధించినవి కావటం మరో విచిత్రం.
1949 లో నిర్మాణమైన ఈ War Cinema నాజీలకు వ్యతిరేకంగా అమెరికా వైమానికసేవ చేసిన యుద్ధం గురించి ప్రస్తావిస్తుంది. 918 Bomb Group అనే పేరుగల ఒక వైమానిక దళం తరచూ విఫలమౌతూ, “Hard Luck Group” అనే పేరుపడి వుంటుంది. ఆ దళానికి నాయకుడు కల్నల్ కీత్ డేవెన్ పోర్ట్ మొత్తం సభ్యులతో ఎంతో చనువుగా వుంటూ, వారి ఆదరాభిమానాన్ని పొంది వుంటాడు. అయినా టీమ్ విఫలమవడం వల్ల అధికారులు అతన్ని తొలగించి అతని స్థానంలో బిగెడీర్ జనరల ఫ్రాంక్ సావేజ్ ని నాయకుడిగా నియమిస్తారు. అలా అధికారంలోకి వచ్చిన సవేజ్ గతంలో నాయకుడిగా వున్న డేవెన్ పోర్ట్ విధానాలకు పూర్తి భిన్నమైన విధానలతో టీమ్ మొత్తాన్ని ఆశ్చర్యానికీ, కొన్ని సందర్భాలలో అసహనానికీ గురిచేస్తాడు. క్రమంగా “Hard Luck Group” అని పేరుపడ్డ ఆ టీమ్ ని విజేతలుగా చేయటమే సినిమా కథ.
ముందే చెప్పినట్లు ఈ సినిమాలో నాయకత్వ లక్షణాల గురించి నేర్చుకునేందుకు చాలా వుంది. నిజానికి ఈ సినిమా ఇప్పటీకీ మిలటరీతో సహా అనేక చోట్ల Leadership Trainingకి వాడుతున్నారు. తొలి భాగంలొ డావెన్ పోర్ట్, తరువాత భాగంలో సావేజ్ అని ఇద్దరు నాయకులు, పరస్పర విరుద్ధమైన ఇద్దరి లక్షణాలు బేరుజు వేసే అవకాశం వల్ల బహుశా ఈ సినిమా అంతటి ప్రాచుర్యాన్ని పొందిందేమో. మేనేజ్మెంట్ చదివిన వారికి (HR లేదా Organisation Understanding)లో చదువుకున్న X మేనేజర్, Y మేనేజర్ గురించి గుర్తుండే వుంటుంది (Workforce motivation theory by Douglas McGregor). ఆ సిద్ధాతం ప్రకారం రెండు రకాల Motivations, ఆ Motivationsకి రెండు రకాల మేనేజర్లు వుంటారు. ఒకరు ఉద్యోగలపై అపనమ్మకంతో, బెదిరిస్తూ, వారిపైన నిఘా వేస్తూ, ప్రతి తప్పుకీ ఒకరిని బాధ్యులని చేస్తూ, వారిని దండిస్తూ వుంటాడు. మరో రకం మేనేజర్ ఉద్యోగులతో చనువుగా వుంటూ, వారి ఇబ్బందులను కష్టాలను అర్థం చేసుకుంటూ, వాటిని తప్పిస్తూ వారి అభిమానాన్ని సంపాదించి తద్వారా ఫలితాలను రాబడ్తాడు. ఇందులో ఏది సరైనది, ఏది కాదు అని చర్చించడం కన్నా ఏది ఏ సందర్భానికి సరిపోయేదో తెలుసుకోని ఆ విధానాన్ని అవలంబించడం ఉత్తమం. ఈ సినిమాలో కనిపించే ఇద్దరు నాయకులు ఈ రెండు విధానాలకు ప్రతీకలుగా నిలుస్తారు. డావెన్ పోర్ట్ Y Type Manager అయితే సావేజ్ X Type Managerగా కనిపిస్తాడు.
ప్రత్యేకించి సావేజ్ ప్రదర్శించే నాయకత్వ లక్షణాలు విలక్షణమైనవిగా కనిపిస్తాయి. 12 Angry Menలో కనిపించే నాయకుడికి భిన్నంగా ఇక్కడ అతనికి పదవి ద్వారా అధికారం లభిస్తుంది. ఆ అధికారాన్ని ఉపయోగించి, అప్పటి వరకూ స్తబ్దుగా పడివున్న టీమ్ లో అలజడి/వ్యతిరేకత సృష్టించడం ద్వారా Charismatic Leaderగా ఎదిగే విధానం ఆసక్తికరంగా సాగుతుంది. అతను ప్రదర్శించే నాయకత్వ లక్షణాల గురించి టూకీగా –
First Strike on Culture
నాయకుడిగా తొలి అడుగులోనే అప్పటివరకు వున్న Culture ని మార్చే ప్రయత్నం చేస్తాడు సావేజ్. అతను అధికారిగా నియమించబడిన యూనిట్ లోకి అడుగుపెట్టగానే సెక్యూరిటీ అతని వివరాలు అడగకపోవటం, యూనిఫార్మ్ విషయంలో శ్రద్ధ లేకపోవటం, Discipline లేకపోవటం వంటి అంశాలను మొదటి టార్గెట్ గా చేసుకుంటాడు. Culture ని మార్చడం ద్వారా మార్పు మొదలవబొతోందని స్పష్టంగా చెప్తాడు.
Creating Tension & Conflict
మొదటిసారి టీమ్ తో మీటింగ్ నిర్వహించినప్పుడు సావేజ్ స్పష్టంగా తన అసంతృప్తిని తెలియజేస్తాడు. తాను చెయ్యబోతున్న మార్పులను తెలియజేస్తూ, అందుకు సిద్ధంగా లేని వాళ్ళని టీమ్ నుంచి వైదొలగమని చెప్తాడు. అతని కింద పనిచేస్తున్న వుద్యోగులతో నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తూ –“Do or Die” అనే సందేశాన్ని ఇస్తాడు. ఇలాంటి Tension మొదట్లో అలజడిని, వ్యతిరేకతని సృష్టించినా తరువాత అదే అతని విజయానికి కారణం అవుతుంది.
Charismatic Leadership
ఇందులో నాయకుడు ప్రదర్శించే Charisma మనం అర్థం చేసుకునే Charisma కి భిన్నంగా వుంటుంది (Unconventional and Radica). అందరూ వ్యతిరేకించే లక్షణాలను ప్రదర్శించినా అదే అతని Charisma గా మార్చుకుంటాడు. టీమ్ లో అందరూ అతని గురించే మాట్లాడుకునేలా చేసి తద్వారా Popularity సంపాదిస్తాడు.
Identifying Change Leaders
తను తీసుకురావాలనుకుంటున్న మార్పులను ముందుకు తీసుకెళ్ళే నాయకులను తనకింద తయారుచేసుకోవడం ఎంత ముఖ్యమో సావేజ్ కి తెలిసినట్లే అనిపిస్తుంది. అందుకే నయానో, భయానో కొంతమంది ఉపనాయకులను తయారు చేసుకుంటాడు. Potential వుండీ వేరే పనిలో మిగిలిపోయిన వారిని  వారికి సరిపోయే పదవులోకి మార్చడం ద్వారా తాను కోరుకున్న Change Leaders ని తయారు చేస్తాడు.
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు వున్నా ముఖ్యంగా మనం గమనించాల్సింది సావేజ్ ప్రదర్శించే Unconventional, Radical, Charismatic leadership. అయితే ఇలాంటి నాయకుడు ప్రతి సందర్భాలలో విజయం సాధిస్తాడని చెప్పడానికి లేదు. కొన్ని అనువైన (Appropriate) పరిస్థితులలో మాత్రమే ఇలాంటి నాయకత్వం ద్వారా విజయం సాధించవచ్చని గమనించాలి. అంతే కాదు ఇలాంటి లక్షణాలను ప్రదర్శించడం ఎంత Stressతో కూడుకున్న పనో చివర్లో Stress వల్ల కుప్పకూలిపోయే సేవేజ్ ని చూసి అర్థం చేసుకోవచ్చు.

12 Angry Men- Management Lessons


మేనేజ్మెంట్ పాఠాల చెప్పే సినిమాల గురించి ఎక్కడ ప్రస్తావించినా ఈ సినిమా పేరు వినపడకుండా వుండదు. ఎన్నో మేనేజ్మెంట్ ట్రైనింగ్లలో, వర్కషాప్ లలో, ఎంబీయే కాలీజీలలో ఈ సినిమాని ఒక కేస్ స్టడీగా ప్రదర్శించడం నాకు తెలుసు. ఆద్యంత ఉత్కంఠభరితంగా సాగుతూనే, అంతర్లీనంగా Leadership పాఠాలు బొధించే ఈ సినిమాని సాధారణ ప్రేక్షకుడు సైతం ఆసక్తిగా చూసేట్లు వుండటమే అందుకు కారణం అనుకుంటాను.
1957లో నిర్మాణమైన ఈ చిత్రం Reginald Rose రాసిన ఒక నాటకం ఆధారంగా రూపొందించబడింది. పన్నెండు మంది జ్యూరీ సభ్యులు ఒక Trail Roomలో ఒక కేసు గురించి చర్చించడమే మొత్తం సినిమా కథ. ఒక టీనేజ్ కుర్రవాడు అతని తండ్రిని కత్తితో పొడిచి హత్య చేశాడు. అందుకు ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేకపోయినా వారి మధ్య వాగ్వివాదం విన్నవారు, దూరం నుంచి పరిగెడుతున్న రైలు పెట్టల సందులలో నుంచి చూసిన వ్యక్తి మినహా సాక్షులు వుండరు. అతను హంతకుడే అని దాదాపు నిర్ధారణ అయిపోయిన సందర్భంలో ఈ పన్నెండు మంది జ్యూరి నిర్ణయాధికారం ఇస్తారు. ముద్దాయి హంతకుడని జ్యూరి నమ్మైతే అతనికి మరణశిక్ష తప్పదని మెలిక పెడతారు.
మంచి ఎండాకాలం ప్రభావానికి వేడెక్కిన గదిలో చర్చ మొదలౌతుంది. అంతా ఏకపక్షంగా వున్న కేసు విషయంలో చర్చించడానికి ఏమీ లేదనీ ముద్దాయి హంతకుడే అని పదకొండు మందు భావిస్తారు. అందరిలొ ఒక్కేఒక్కడు అందుకు వ్యతిరేకంగా ఒక వేళ ముద్దాయి నేరస్థుడు కాడేమో అన్న అనుమానాన్ని లేవనెత్తుతాడు. ఆ ఒక్క వ్యక్తి మిగిలిన పదకొండు మందిని ఎలా తనవైపుకి తిప్పుకున్నాడు అన్నది మిగతా కథ.
మేనేజ్మెంట్ పాఠాలు
కథ విన్న ఎవరికైన ఈ సినిమాలో Negotiation Skills, Persuasion వంటి విషయాలు నేర్చుకోవచ్చని అర్థమైపోతుంది. నిజానికి ప్రపంచవ్యాప్తంగా ఎన్నొ విశ్వవిద్యాలయాలలో ఈ సినిమాని Negotiation Skills నేర్పించడానికి వాడతారు. ఆ విషయాన్ని అలా పక్కన పెడితే ఈ సినిమాలో మరీ ముఖ్యంగా నేర్చుకోవాల్సింది – LEADERSHIP (నాయకత్వ లక్షణాలు) గురించి.
Leading a diversity
పైన ప్రస్తావించిన జ్యూరీని గమనిస్తే ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. చివరిలో పలకరించుకునే ఇద్దర్ని మినహాయిస్తే సినిమా మొత్తం మీద వాళ్ళలో ఎవరికీ ఒకరికొకరికి తెలియదు. కనీసం సినిమా అంతా పేర్లు కూడా చెప్పరు. అందులో ఒక ఫోర్ మాన్, బ్యాంక్ క్లర్క్, స్టాక్ బ్రోకర్, బిజినెస్ మాన్, పెయింటర్, సేల్స్ మాన్, ఆర్కిటెక్ట్, గెరాజ్ ఓనర్ ఇలా ఒకదనితో ఒకటి సంబంధం లేని వృత్తివ్యాపారాలలొ వుంటారు. ఇలాంటి ఒక వైవిధ్యమైన groupకి నాయకత్వం వహించడం ఈ కథానాయకుడు సాధించే విజయం. సరిగ్గా ఇలాంటి సందర్భాలే మేనేజర్ల నిజ జీవితంలో కూడా ఎదురౌతుంటాయి. ఒకదానికొకటి ఏమాత్రం పొంతన లేనివాళ్ళు ఒక టీమ్ లో వుండి, వారి వారి దృక్కోణం (perspective) నుంచి మాట్లాడటం వల్ల టీమ్ బలహీనపడుతుంటుంది. ఇలాంటి సందర్భాలలోనే అందరినీ ఒక తాటి పైన నడిపించగల నాయకుడి అవసరం కనపడుతుంది.
Title no source of Leadership
ఇందులో నాయకత్వం నెరిపే కథానాయకుడు (జ్యూరర్ నెం. 8) ఏ పదవి అడ్డం పెట్టుకొని రాడు. ఆ జ్యూరీలో అతనికి స్థానం మిగతా అందరితో సమానమే తప్ప అతనేమో నియమించబడ్డ నాయకుడు కాదు. చర్చ ముందుకు సాగుతున్నప్పడు క్రమంగా అతను తన శక్తి సామర్థ్యాలతో నాయకుడి స్థానాన్ని ఆక్రమిస్తాడు. తాను నాయకుడు అయిన విషయాన్ని కూడా ఎక్కడా ప్రస్తావించడు. చాలా మంది మేనేజర్లలో Designation ఆధారంగా నాయకత్వం వస్తుందన్న అపోహ వుంటుంది. నాయకుడు కావాలంటే పదవులతో పనిలేదని నిరూపిస్తుంది ఈ సినిమా.
Unclear Information leads to decision making
ముద్దాయి నేరస్థుడు కాదేమో అన్న అనుమానం మీదే చర్చ మొత్తాన్ని నడుపుతాడు జ్యూరర్ నెం. 8. అందుబాటులో వున్న సాక్షాధారాలు చాలా పరిమితంగా వుంటాయి. ఇలాంటి సందర్భంలో ఒక నిర్ణయానికి రావటం అంత సులభంకాదు. ఒక వేళ అతను నేరస్థుడు కాకపోతే పర్యవసానం ఎంత ఘోరంగా వుంటుందో చెప్పడం ద్వారా (కథా) నాయకుడు మిగిలినవారి ఆలోచనలను రేకెత్తిస్తాడు. ఎన్నో బిజినెస్ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇలాంటి సందర్భాలు ఎదురౌతాయి. ఒక్క తప్పు నిర్ణయం ఘోరమైన వైఫల్యాలకు దారి తీయవచ్చు. నిర్ణయం తీసుకోడానికి అవసరమైన సమాచారం పూర్తిగా వుండక పోవచ్చు. అలాంటి సందర్భంలోనే నాయకుడి అవసరం, ఆ నాయకుడు కేవలం ఘోర వైఫల్యాన్ని, పరిమితంగా వున్న సమాచారంలో వున్న లోతుపాతుల్ని ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఇందులో బోధించబడింది.
Influencing others
ఈ విషయంలో ప్రత్యేకించి చెప్పేదేమీలేదు. సినిమా కథంతా ఒక్క వ్యక్తి పదకొండు మందిని ఎలా తన వైపుకి తిప్పుకున్నాడనేదే. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, మొదలు పెట్టినప్పుడు అందరూ వ్యతిరేకించిన విషయాన్ని ఒక్కొక్కరుగా ఒప్పుకోవడం మొదలు పెడతారు. ఆ వరస గమనిస్తే కథా నాయకుడు అందరికన్నా Loose Link ఎక్కడ వుందో గమనించి వాళ్ళని తనకు సమర్థించేలా చేసుకుంటాడు. క్రమ క్రమంగా Created & Managed Tension ప్రవేశపెట్టి అందరినీ తనవైపు తిప్పుకుంటాడు. ఒక నాయకుడికి వుండాల్సిన బలమైన లక్షణాల్లో ఇది ఒకటి.
Communication & Negotiation
ఇవి కూడా ప్రస్ఫుటంగా కనపడే పాఠాలు. Enquiry led dialogue, Effective listening, reasoning, humility, empathy వంటి లక్షణాలు Communication  & Negotiation లో ఎంత ముఖ్యమో ప్రత్యక్షంగా చూపుతుందీ చిత్రం.
చూస్తున్న కొద్దీ కొత్త కొత్త పాఠాలు నేర్పే ఈ సినిమా ప్రతి సంస్థలో, ప్రతి ఉద్యోగికీ ముఖ్యంగా ప్రతి మేనేజర్ కి చూపించాల్సిన సినిమా.

Monday, 27 February 2012

Time Management( Telugu Version) PART 1


Time Management అనేది ఈ రోజుల్లో అత్యంత తరుచుగా చర్చించబడే విషయం అయిపోయింది. ఇంతకు ముందు ఈ విషయం కేవలం కార్పోరేట్ సంస్థలలో ఉన్నత స్థాయి అధికారులకు, కార్యనిర్వాహకులకు మాత్రమే సంబంధించిన విషయంగా పరిగణించే వారు.
నర్సరీ పిల్లాడి నుండి విశ్రాంత జీవనం గడిపేవారి దాక ఈ రోజుల్లో అందరినోటినుండి వచ్చే మాట ఒక్కటే. సమయం చాలడం లేదు.                               ఒక్కోసారి పిల్లలు తమ తల్లిదండ్రులను అడుగుతుంటారు '' రోజుకి ఇరవై నాలుగంటలే ఎందుకు మరో రెండు గంటలు ఎక్కువ చెయ్యవచ్చు కదా.'' అని. మనలో కొందరికి నిజమే కదా అనే ధర్మసందేహం కూడా వస్తుంది. పూర్వం వ్యవసాయ ప్రధాన మరియు ఉమ్మడి కుటుంబాలు ఉండే సమయాలలో ఉన్న సమయం అందరికీ సరిపోయేదేమో కాని నేటి ఆధునిక, పారిశ్రామిక, వ్యష్ఠి కుటుంబాల కాలం వచ్చే సరికి రోజు రోజుకి విస్తృతమౌతున్న పని ఒత్తిడి ఏ పని సమయానికి అనుకున్నట్టు గా జరగనీక తీవ్ర నిరాశకు నిస్పృహలకు అంతే కాకుండా పలుచనైపోతున్న ఆత్మీయ బంధాలకు దారి తీస్తుంది.
                   ఇంతకీ టైం మేనేజ్ మెంట్ అంటే ఏమిటి ? అందులో ప్రధానమైన విషయాలేమిటి ? మనకు దైనందిన వ్యవహారాల్లో  ఇది ఎంత వరకు ఉపయోగపడుతుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం. బయట కంపెనీల్లో పనిచేసేవారికైనా లేదా ఇంట్లో ఉండే గృహుణులైనా తాము అయినా చేయవలసిన పనులను శాస్త్రీయంగా ఎలా నిర్వహించవచ్చో తెలుసుకుందాం. దీని వలన మాకేమి ఉపయోగం ? ఇలా అయితే పనులు తగలడి నట్టే అనే ఆలోచన వస్తుందా? ముందు మనస్సులోంచి తొలగించి సానుకూలంగా ఆలోచిస్తూ మీకు ఉపయోగపడేవి మరియు పాటించడానికి వీలున్నవి వీలైనంత వరకు పాటించండి. 
టైం మేనేజ్ మెంట్  నిర్వచనం; 
    టైం మేనేజ్ మెంట్ ( సమయ పాలన) అంటే నిర్ధిష్టమైన పనులను చేపట్టేడపుడు అందుబాటులో ఉన్న సమయాన్ని, సక్రమంగా వినియోగించుకునేందుకుతగిన పద్ధతులు, నైపుణ్యాలు, చిట్కాలు, విధానాలు వినియోగించడమే
                అంటే మనం ఏదైనా పనిని చేపట్టేడపుడు మనకు అందుబాటులో ఉన్న సమయం లో ఆ పని ఎలా పూర్తి చేయాలో అందుకు ఏ పద్ధతులు అనుసరించాలో తెలియచేసే కార్యనిర్వాహక ప్రణాళిక.

టైం మేనేజ్ మేంట్ లో ప్రధానమైన అంశాలు 
planning, ; ప్రణాళిక     
  Division of work ; పని విభజన     
   allocating, ; పనిని కేటాయించుట 
  setting goals, ; లక్ష్య నిర్దేశన      
 delegation, ;అధికారాన్ని బాధ్యతలను బదిలీ చేయుట     
analysis of time spent, ; పూర్తయిన సమయాన్ని పున; పరిశీలించుట ·
 monitoring, పర్యవేక్షణ  
  organizing, నిర్వహణ       
   scheduling, సమయాన్ని పనులకు అనుగుణం గా కేటాయించుట 
    prioritizing. పనుల ప్రాధాన్యతలను బట్టి వర్గీకరించుట

పైన పేర్కొన్న మేనేజ్ మెంట్ పదాలను చూసి ఇదేదో మనకు సంబందించని లేదా మనకు సంబంధం లేని విషయాలు అనుకోకండి. ఇవన్నీ మీరు నిత్యం ఇంట్లో  బయట  అన్ని విషయాలలో పాటిస్తున్నవే.

OBSTACLES : ఆటంకాలు ; ప్రతి ఒక వ్యక్తి సమయానుకూలంగా తన పనులను, సమయానికన్నా ముందుగా చేయాలనుకుంటాడు. కావాలని సమయాన్ని ఎవరూ వృథా చేసుకోడు. అయినప్పటికీ కొన్ని అనివార్యమైన పరిస్థితుల ప్రభావం వలన లేదా తన చేతిలో లేని బయట కారణాల వలన తన ప్రమేయం లేకుండా సమయం వృథా అవడమే కాకుండా అనుకున్న పనులు వాయిదా పడుతుంటాయి.   ఈ  ఆటంకాలను రెండు రకాలుగా వర్గీకరించవచ్చును. అవి. 
            A.  బహిర్గత ఆటంకాలు  External Obstacles                            
            B.  అంతర్గత ఆటంకాలు   Internal Obstacles                                వీటి గురించి మరింత వివరంగా తెలుసుకుందాం.  
A.  బహిర్గత ఆటంకాలు  External Obstacles ; 
బహిర్గత ఆటంకాలంటే  మన ప్రమేయం లేకుండా మన పనులకు ఆటంకం కలిగించేవి.   అవి.                                                                                 1. అంతరాయాలుః (Interruptions):   మెయిల్స్,  చాటింగ్, ఫేస్ బుక్, ఫోన్స్ మొదలగునవి మనం చేసే పనిని నిలుపుదల చేసి  అసలు పని మాని లేనిపోని విషయాలతో సమయాన్ని వృథా పరుస్తుంటాయి.
2. బాతాఖానీలు (Socializing conversations): ఆఫీస్ లో గానీ  ఇరుగు పొరుగు తో ఖానీ  అదేపని గా  ప్రపంచంలో అన్ని విషయాలు, రాజకీయాలు, వార్తా పత్రికల్లో విషయాలు, క్రికెట్ మ్యాచుల పై  విశ్లేషణలు, టీ.వీ. సీరియళ్ళ పై వ్యాఖ్యానాలు ఒకటేమిటీ  అనేకరకాలైన పిచ్చాపాటి కబుర్లతో గంటలు గంటలు భోంచేస్తూ బ్రేవ్ మని తేన్చుతుంటారు.  తీరా  సమయం వృథా అయిన తర్వాత తీరిగ్గా ఎదుటివారివలనే  సమయం పాడయిపోయిందని బాధపడుతుంటాం.  వాళ్ళుకూడా అలాగే భావిస్తుంటారని మనకు తెలియకపోవడం ఒకవిధం గా మన అధృష్టమే. 
౩. అనేక పనులు  ఒకేసారి చేయడం ( Multi Tasking):  సవ్యసాచుల్లా రెండు చేతులతో నాలుగు పనులు ఒకేసారి నెత్తిన వేసుకోవడం వలన ఏ పని పూర్తికాకుండా అన్ని పనులు చెడగొట్టుకుంటుంటారు చాలామంది.  ఇలా అనేక పనులు ఒకేసారి చేయాలనుకోవడం కూడా ఒకవిధంగా పనులు సమయానికి జరగడానికి ఆటంకమే.
4. అనుకోకుండా వచ్చే అతిథులు (Unscheduled Visitors): తిథి, వారం, నక్షత్రం చూడకుందా వచ్చే వాళ్ళే అతిథులంటారట.  కాని మనం ఏదైనా పనికోసం బయలుదేరుతున్నప్పుడు అతిథులు గాని ఎవరైనా మనతో పని కోసం వస్తే  తప్పనిసరిగా మన పనిని వాయిదా వేసుకొని వాళ్ళకు మనం సమయం కేటాయించవలసి వస్తుంది. అలా అని మన పనులకోసం వాళ్ళతో సమయం గడపకపోతే మన మర్యాదకే లోపం ఏర్పడుతుంది.  మన పనులు సమయానికి జరగకపోడానికి మనింటికి ముందస్తు సమాచారం లేకుండా వచ్చే సందర్శకులు కూడా ఒక కారణమే.
5. అస్తవ్యస్తంగా ఉన్న పని పరిస్థితులుః (Poor Work Environment) కంపెనీలో గాని. ఆఫీస్ లో గాని ఇంట్లో గాని పరిసరాలు సరిగా లేకపోతే  చేసే పని సమయానికి జరగకపోవచ్చును.  అస్తవ్యస్తంగా ఉన్న పరిసరాలు చికాకు పెడుతూ, ఏ వస్తువు సమయానికి దొరకక, నిత్యం కావలసిన వస్తువుల కోసం వెతుక్కుంటూ సమయం వృథా అవుతుంది. ఎక్కడ ఏ వస్తువు ఉందో, కాళ్ళకు  ఏదో వస్తువు తగులుతూ ఉంటే అరికాలమంట తలకెక్కుతూ ఉంటుంది. కాలుష్యం, వేడి, దుర్గంధం మొదలైనవి శ్రామికుల ఉత్పాదకతపై ప్రభావం చూపుతుందని ఎల్టన్ మేయో అనే మేనేజ్ మెంట్ నిపుణుడు ఎప్పుడో నిరూపించాడు. 
6. అస్పష్టమైన లక్ష్యాలు ( Unclear Goal):  చేయవలసిన పని మీద సరియైన స్పష్టత లేకపోతే, ఒక పని ఎందుకు చేయాలో, ఎప్పుడు చేయాలో ఒక అవగాహన మరియు స్పష్టత ఉంటే ఆ పని సమయానికి జరగడానికి అవకాశం ఉంటుంది. లక్ష్యం ఉన్న వ్యక్తి వంద తప్పులు చేస్తే  లక్ష్యం లేని వ్యక్తి వేయి తప్పులు చేస్తాడని స్వామి వివేకానంద అన్నాడు. అస్పష్టమైన లక్ష్యాలు మన పనులు సమయానికి జరగక పోడానికి సమయం వృథా కాడానికి ఒక కారణం మరియు అతి ముఖ్యమైన ఆటంకం.
7. ఇతరుల సహకారం పై అతిగా ఆధారపడటం ( Too much dependency on others' cooperation):  మన పనులు మనంతట మనం చేసుకోవడం మాని ఇతరుల సహకారం మీద అతిగా ఆధారపడటం కూడా సమయం వృథా అవడానికి ఒక కారణం.  కంపెనీ లో అన్ని విభాగల మధ్య సమన్వయం, సహకారం లోపిస్తే పనులు సకాలం లో జరగక పనుల్లో స్తబ్దత ఏర్పడి కాలహరణం జరుగుతుంది.
8. ఉద్యోగ స్వామ్యం ( Bureaucratic Red Tape) : ఇది సంస్థలలో పనులు  జరగడానికి  వ్యవస్థాపితమైన క్రమానుగత శ్రేణిని అనుసరించి నియమాలకు  అనుగుణంగా చేయాల్సి ఉంటుంది. ఒక ఫైల్ అన్ని విభాగాలకు వెళ్ళి రావాలంటే చాలా సమయం పడుతుంది.  అలా అని నియమాలను ఉల్లఘించినట్లైతే అది అధికార దుర్వినియోగమవుతుంది.  ఇది చాలా కాలయాపనకు ,జాప్యతకు దారి తీస్తుంది.   
B.  అంతర్గత ఆటంకాలు   Internal Obstacles : 
అంతర్గతమైన ఆటంకాలంటే కేవలం మన అలవాట్లవలన, ప్రవర్తన వలన మన దృక్పథాల వలన మన పనుకు జరగడానికి ఏర్పడే ఆటంకాలు.
1. వాయిదా వేసే గుణం ( Procrastination): కొంతమంది పనులను తీరిగ్గా వాయిదా వేస్తూ, తీరా గడువు సమీపించేసరికి హైరానా పడుతుంటారు. " కొండలా కోర్సు ఉంది. ఎంతకీ తగ్గనంది, ఏందిరా వింత గొడవా? ఉందిలే సెప్టెంబర్ మార్చి పైన, వాయిదా పద్ధతుంది దేనికైనా" అని అక్కినేని నాగార్జున నటించిన శివ సినిమాలో ఒక పాట ఉంటుంది. అలా ప్రతి పని పని వాయిదా వేస్తుంటారు. దీనివలన చివరి నిమిషంలో పని జరగకపోవడం లేద పెద్ద మొత్తం లో డబ్బు చెల్లించవలసి రావడం జరుగుతుంది. చాలామంది ప్రయాణాలు ముందుగా వెళ్ళలని తీర్మానించుకున్నప్పటికీ చివరి నిమిషం వరకు రిజర్వేషన్ చేయించరు. ఈ వాయిదా గుణాన్ని బాగా అర్థం చేసుకున్న అప్పటి రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్  తత్కాల్ స్కీమ్  ప్రవేశపెట్టి ఇండియన్ రైల్వేస్ ని లాభాల బాట పట్టించారు.  విమానంలో ప్రయాణించేవారు కూడా ముందుగా రిజర్వ్ చేసుకుంటే చాలా తక్కువ చెల్లించాల్సి ఉంటుంది. కాని చాలా మంది  చివరి నిమిషం వరకు వాయిదా వేస్తూ ఆయా విమానయాన సంస్థలను పోషిస్తూ ఉంటారు.
    ఈ వాయిదా వేసే తత్వం మన వాళ్ళల్లో ఎంత పురాతనమైనదో చెప్పడానికి కబీర్ మహశయుడు   ఒక చక్కని దోహే లో ఇలా చెప్పాడు.
కల్ కరే సో ఆజ్ కర్  ఆజ్ కరే సో అబ్ కర్                                                    పల్ మే పర్లయ్ హోయేగీ  బహురీ కరోగే కబ్                                             దీని అర్థం ఏమిటంటే రేపు చేయాలనుకున్నదీ  ఈ రోజే  చెయ్యు. ఈ రోజు  చెయ్యాలనుకున్నది ఇప్పుడే  చెయ్యు.  క్షణకాలంలో  ప్రళయం రావచ్చు.  తర్వాత  ఏమి చెయ్యగలవు.  కాబట్టి  వాయిదా  వేసే తత్వం  మంచిది  కాదని.  అతని అభిప్రాయం. 
2. ప్రణాళిక లేక పోవడం ( Lack of Planning) : ఏదైనా  పని  చేసే ముందు  పని  ఎలా  చెయ్యాలి. దానిని వివిధ భాగలుగా విభజిస్తూ ఒక ప్రణాళిక  అవసరం.    If you fail to Plan, You plan to fail  అన్నది ఆంగ్ల సామెత.  అంటే  ప్రణాళిక వేయడం లో విఫలమైతే, విఫలమవడానికి ప్రణాళిక  వేస్తున్నట్టే అని అర్థం. ప్రణాళిక వేయడం ఎంత ముఖ్యమో దానిని అనుకున్నట్టుగా అమలు చేయడం అంతే ముఖ్యం. Plan without Action is Futile but Action without plan is fatal.  ప్రణాళిక ఉండి అది అమలు చేయకపోతే అది వ్యర్థం కాని అసలు ప్రణాళిక లేకుండా పని చేస్తే అది ప్రమాదకరం. ప్రణాళిక లేకుండా పని చేయడం వలన తక్కువ సమయంలో పూర్తి కావలసిన పనులు ఆలస్యం కావచ్చును.
3. ప్రాధాన్యతల క్రమం లేకపోవడం (  Lack of Prioritization) : నేటి ఆధునిక కాలంలో మనిషి చాలా బిజీ అవుతున్నాడు. ఉన్న కొద్ది సమయంలోనే అనేక పనులు చేయవలసి వస్తుంది. ఏ పని వెంటనే చేయాలి. ఏ పని ఇతరులకి అప్పగించాలి ఏ పని తరువాత చేయవచ్చు అనే విషయం లో  అవగాహన లోపించడం వలన ముందు చేయవల్సినది వెనుక, తరువాత చేయవలసినది ముందు చేస్తూ తన జీవితాన్ని కిందా మీదా చేసుకుంటున్నాడు. ప్రధాన మంత్రి కైనా, తపాలా బంట్రోతుకైనా ఉన్న సమయం రోజుకి ఇరవై నాలుగు గంటలే. ఉన్న సమయాన్ని తన ప్రాధాన్యతల ప్రకారం ఉపయోగించుకోవాలి.
4. సత్వర నిర్ణయాలు తీసుకోలేకపోవడం ( Indecisive Nature): సరియైన సమయంలో సరియన నిర్ణయం తీసుకోవడం లో విఫలమైతే దాని ప్రభావం మన సమయం పై పడుతుంది. the decision that delayed is the decision not taken అని అంటారు.  ఆలస్యం గా చేసిన నిర్ణయం అసలు నిర్ణయమే కాదని. నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యమైతే దాని అమలులో మరింత ఆలస్యమవుతుంది. పని సకాలంలో పూర్తి చేయడం కూడా కష్టమవుతుంది. దాని ప్రభావం ఇతర పనులపై కూడా పడుతుంది.
5. పరిపూర్ణత్వానికై పరితపించుట ( Perfectionism) : చాలా మంది పనులు చేసే టపుడు నూటికి నూరుపాళ్ళు ఖచ్చితంగా జరగడానికి చూస్తుంటారు. ఉన్నంతలో పరిపూర్ణతకోసం ప్రయత్నించడం మంచిదే కాని ఆ క్రమంలో అన్ని పనులు ఆపి ఆ ఒక్క పనిలో నిమగ్నమైతే ఉన్న సమయం కాస్త గడిచిపోతుంది. ఎంత బాగా చేసినా ఏదో ఒక తప్పిదం జరగడానికి అవకాశం ఉంటుంది. అది అంతిమ ఫలితం పై ప్రభావం చూపనంత వరకు అలా వదిలేస్తే మంచిది. అలా కాదని చేసిందే చేసుకొని కూర్చుంటే  అది ఒక Obsession Compulsion Disorder అనే మానసిక జాడ్యానికి దారి తీస్తుంది.  
6.  మానసిక, శారీరక అలసట ( Mental and Physical Exhaustion) : పనికి పనికి మధ్య తగిన విశ్రాంతి తీసుకోకుండా అదే పనిగా కొనసాగించడం వలన శారీరకంగా, మానసికంగా అలసిపోవడం వలన చేస్తున్న పనులు ఆలస్యమై ఏ పని సరియైన సమయానికి జరగదు.  సాధ్యమైనంతవరకు  అలసట  ఉన్నప్పుడు   చేస్తున్న పని ఆపి విశ్రాంతి తీసుకోవడం మంచిది. 
7. మొహమాటం ( Not being able to say NO) : చాలామంది  తమకు  తమపై  అధికారి గాని లేదా స్నేహితులు గాని ఏదైనా పని అప్పచెబితే  అది వారి వలన సాధ్యం కాకపోయేటప్పటికీ  మొహమాటం కొద్దీ ఆ పనిని చేస్తామని ఒప్పుకుంటారు. ఆ పని చేయలేక చేయలేమని ఒప్పుకోలేక ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు అందరి వద్ద చివరికి మాట పడటమే కాకుండా వాళ్ళ పనికూడా పూర్తి చేయలేకపోతారు. అందరినీ సంతృప్తి పరచడం చాలా కష్టం. ఎంత మంచి అనిపించుకోవాలని ప్రయత్నిస్తే అంత చెడ్డ అనిపించుకోడానికి అవకాశం ఉంటుంది. 
8. క్రమబద్ధత లేకపోవడం ( Lack of Orderliness):  చాలామంది తాను  పని  చేసే  చుట్టూ ఉన్న పరిస్థితులు, తాను ఉపయోగించే వస్తువులను శుభ్రంగా ఉంచుతూ, పని అయిన తర్వాత వాటిని యథాస్థానంలో ఉంచుతారు.  ఈ రకమైన క్రమశిక్షణ వలన మరలా ఆ వస్తువులు అవసరమైనప్పుడు వెతుకుతూ సమయాన్ని వృథా చేస్తుంటారు. అందుకే ఇంటిని చూసి ఇల్లాలిని, పనిచేసే ప్రదేశాన్ని చూసి పనితనాన్ని చూడాలంటారు.  జపాన్ వారి పద్ధతి అయిన 5S  బహుళ ప్రాచుర్యం పొందడానికి కారణం చాలా మందిలో ఈ క్రమశిక్షణ లోపించడమే.
9. తగిన ప్రేరణ, ఉత్సాహం లేకపోవడం ( Lack of Motivation and encouragement ) : చాలామంది స్వతహాగా చాలా నెమ్మదిగా, నిస్తేజంగా  పని  పట్ల ప్రత్యేకమైన ఉత్సాహం లేకుండా తక్కువ ప్రేరణ తో ఉంటారు.  వారికి తగిన గుర్తింపు లేకపోవడం వలన గాని, వారిలో ప్రేరణ కలిగించకపోవడం వలన గాని monotony కి లోనై ఏ పని పైన శ్రద్ధ చూపరు. దీని వలన అనుకున్న సమయానికి పనులు జరగవు. అందుకే అన్ని సంస్థలలో  ఉద్యోగులలో ప్రేరణ కలిగిస్తూ వారికి తమ పని పట్ల ఉత్సాహం, ఉత్తేజం కలిగించడాని మానవ వనరుల అభివృద్ధి విభాగం ఏర్పాటు చేయడం, సాంస్కృతిక కార్యకలాపాలకు, సెలవుతో కూడిన విహారయాత్రలకు అవకాశం కల్పిస్తుంది. 
10. ఒత్తిడి ( Stress):  ఈ రోజుల్లో సమాజంలో అన్ని వర్గాల వారి లో పని వలన వచ్చే ఒత్తిడి చాలా అధికంగా ఉంటుంది. Unrealistic deadlines, Inspections, Review meetings, Report Submissions ఒకటేమిటి  అన్ని  రకాలుగా  తీవ్రమైన పని ఒత్తిడి ఉంటుంది. ఇది ఉద్యోగుల పనితీరు పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇంట్లో కూడా తెల్లవారి పిల్లలను స్కూల్ కి పంపించడం వారికి కేరేజ్ కట్టడం, శ్రీవారికి ఇస్త్రీ బట్టలు అందించడం మొదలుకొని ఆఫీస్ కి పంపించడం ఇలా అనేక పనుల మధ్య ఒత్తిడితో అపర కాళిక మాతల్లా  ఉంటారు.  ఇలా ఒత్తిడికి గురయ్యే వారిలో హర్మోన్ల సమతౌల్యం కూడా దెబ్బతిని వారి ఉత్పాదక సామర్ధ్యం తగ్గుతుందని పరిశోధనలు  తెలియచేస్తున్నాయి.  
ADVANTAGES OF GOOD TIME MANAGEMENT : సమయాన్ని సరిగా నిర్వహించుకోడానికి ఉపయోగపడే వివిధ పద్ధతులు, చిట్కాలు, నైపుణ్యాలు గురించి తెలుసుకునే ముందు అసలు సమయాన్ని సరిగా నిర్వహించడం వలన కలిగే ఉపయోగాలు ఏమిటో తెలుసుకుంటే  వాటిపై మనకు ఆసక్తి ఏర్పడటానికి అవకాశం ఉంటుంది.
1.Goals and Objectives are Achieved: లక్ష్యాల సాధనః సరియైన టైం మేనేజ్ మెంట్ పద్ధతులను అలవరుచుకుంటే మన లక్ష్యాలు, ఉద్ధేశ్యాలు మనం సకాలంలో ఎటువంటి హైరానా లేకుండా నెరవేర్చుకోడానికి అవకాశం ఉంటుంది.                                                                                2.Confidence  and Good will are increased: ఎప్పుడైతే మన పనులను సకాలంలో , సక్రమంగా పూర్తి చేయగలుగుతామో మనపై మనకు నమ్మకం పెరుగుతుంది. ఇతరులలో మన పట్ల గురి పెరుగుతుంది.  ఏ పని సరిగా చేయకపోతే మన విశ్వాసం సన్నగిల్లడమే కాకుండా ఇతరులు మనల్ని తక్కువగా చూసే అవకాశం ఉంటుంది.                                           3.Stress will be reduced:( ఒత్తిడి తగ్గుతుంది)  సరియైన టైం మేనేజ్ మెంట్ పద్ధతుల్ని అలవాటు చేసుకుంటే  ఒక క్రమ పద్ధతిలో మన పనులు మనం సకాలం లో పూర్తి చేయడం వలన మనపై ఎటువంటి ఒత్తిడి, చిరాకులు ఉండవు. ఇతరులతో చిన్న చిన్న విషయాలకు చిరాకు పడాల్సిన అవసరం ఉండదు.                                                                            4.Peace of Mind and Sense of Achievement:(మానసిక ప్రశాంతత  మరియు సంతృప్తి):  పని పట్ల సరియైన క్రమశిక్షణ అలవడుతుంది. తత్ఫలితంగా పనులు సరిగా జరగడం వలన మానసిక ప్రశాంతత అలవడుతుంది. లక్ష్యాలు సాధించామనే తృప్తి కలుగుతుంది.                      5.Increased energy: పనులు సరిగా పూర్తి కాక హైరానా పడుతూ ఉన్న శారీరక మానసిక శక్తులను దుర్వినియోగపరచుకోవలసిన స్థితి ఏర్పడదు కాబట్టి సమయ పాలన సరిగా చేసుకొనే వారికి శక్తి పెరుగుతుంది. 6.Increased Productivity:  చేస్తున్న పని  సమయానికి  పూర్తికావడం  వలన   ఇంకా ఎక్కువ పనులు చేయడానికి సమయం మిగిలి ఉంటుంది. తక్కువ కాలంలో ఎక్కువ పనులు చేయడం ద్వారా తన ఉత్పాదకత పూర్తిస్థాయిలో ఉండే విధంగా పనిచేయగలడు.                          7.Financial stability  (ఆర్ధిక సుస్థిరత): శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అన్నాడో కవి.  ఎప్పుడైతే తన కర్తవ్యాలని సరిగా నిర్వహించ గలుగుతాడో తన రంగం లో ఉన్నత స్థానానికి చేరుకోడానికి అవకాశం ఉంటుంది.  తత్ఫలితంగా ఆర్ధికంగా కూడా ముందంజ వేయడానికి అవకాశం ఉంటుంది.                                                                                          8. Promotion in the Job ( ఉన్నత స్థాయికి ఎదుగుదల). ఒక వ్యక్తి ఒక సంస్థలో ఉద్యోగం పొందినపుడు తన విధులను ఎటువంటి జాప్యత లేకుండా సరిగా చేయగలగడం ద్వారా ఉన్నతాధికారుల ధృష్టిలో పడతాడు. నేటి కార్పోరేట్ రంగం లో కేవలం పనితీరు బట్టే ప్రమోషన్లు ఉంటాయి. ఉన్న పని చేయడానికి పరేషాన్ అయ్యేవాడికి ప్రమోషన్ కాదు  ఫైరింగ్ ఆర్డర్ సిద్ధంగా ఉంటుంది.                                                                                          9. Maximum Utilization of Time;  (సమయాన్ని గరిష్టంగా సదుపయోగం   చేయగలడం)  ఒకే పని నాన్చుకుంటూ చేస్తుంటే సమయం వృథా అవడమే కాకుండా  సమయ గరిష్ఠ వినియోగం తగ్గిపోతుంది.  ఒక పద్ధతి ప్రకారం పనిచేసే వారు సమయాన్ని గరిష్ఠంగా వినియోగించుకోగలుగుతారు.                                                              10. Stronger Family Bonds ( కుటుంబ బాంధవ్యాల అభివృద్ధి) చాలా మంది ఆఫీస్ లో పని సకాలంలో పూర్తిచేయలేక ఆ ఫైళ్ళన్నీ ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో వారితో ఉలుకు పలుకు లేకుండా ఫైళ్ళల్లో మునిగిపోతారు. కంపెనీ విషయాలు చర్చిస్తూ ఆ పని అవ్వలేదు ఈ పని అవ్వలేదు అంటూ ఫోన్ లో కూడా తోటి ఉద్యోగస్తులతో చర్చిస్తూ ఇంట్లో వారిని ఉపేక్షిస్తుంటారు. దానివలన కుటుంబ సభ్యులలో నిర్లిప్తత ఏర్పడుతుంది. అలా కాక సమయపాలన సరిగా చేస్తూ ఎక్కడ పనులు అప్పటి కప్పుడే పూర్తిచేయగలిగితే ఇంట్లో వారితో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం ఉంటుంది. అందరి మధ్య ప్రేమాభిమానాలు పరిడవిల్లుతాయి. 
WHAT IS THE VALUE OF THE TIME....
value of One Year:   ఒక సంవత్సరం  విలువ  తెలుసుకోవాలంటే  ఒక  విద్యా  సంవత్సరం కోల్పోయిన విద్యార్థిని అడిగితే తెలుస్తుంది.  EAMCET  లేదా I.I.T.  లో రాంక్ రాకపోవడం వలన  ఆ విద్యార్థి  లాంగ్  టెర్మ్  కోచింగ్  తీసుకుంటే తరువాత సంవత్సరం కోర్సు లో జాయిన్  అయితే  ఆ విద్యార్థి  ఉద్యోగం పొందినంతవరకు  విద్యా సంవత్సరం లో ఎందుకు తేడా వచ్చిందో  వివరించాల్సి ఉంటుంది. అంతే కాక  తనతో చదువుకునే వాళ్ళకు జూనియర్  అవుతాడు.  ఒక సంవత్సరం విలువ  ఆ విద్యార్థి కి బాగా తెలుస్తుంది.
  value of One Month: ఒక నెల విలువ తెలుసుకోవాలంటే ఎనిమిదో నెల గర్భం తో ఉన్న ఒక స్త్రీ  గైనకాలజిస్ట్ దగ్గరకు వెళ్తే ఆమె తనని పరిశీలించి అత్యవసరంగా సిజెరియన్ చేసి బిడ్డయొక్క రక్షణ్ దృష్ట్యా బయటకు తీసి ఇంక్యుబేటర్ లో ఒక నెల రోజులు ఉంచితే  ఆ బిడ్డ సంరక్షణ కోసం తల్లడిల్లే ఆ తల్లికి ఒక నెల యొక్క విలువ తెలుస్తుంది.

Thursday, 23 February 2012

Certificate from APITCO for Oscar Trainers



One more feather in the crown of Oscar.... We are certified from APITCO, New Delhi by participating Faculty Development Program which is conducted at Kurnool Collectorate Premises.... The theme of the program is Entrepreneur and Skill Development....   

Wednesday, 15 February 2012

7 Powerful Success Principles


A principle is a rule or law concerning a natural occurrence. When principles are applied, the results are predictable. Today I want to talk about seven success principles that will make your success a natural occurrence. These principles are timeless; they will work today the same as they worked 2,500 years ago, the same as they will work 2,500 years from now.
If you follow the success principles, success will surely be yours. Contrary to popular opinion, public debate, and what you may have seen on television, success is not the result of good luck. Success comes from the proper application of principles.
With that said, here are seven powerful success principles.

1. Prepare

“It’s not the will to win, but the will to prepare to win that makes the difference.” -Paul Bryant
Success occurs when the prepared individual creates their own opportunity. Are you prepared? Preparation is the foundation of success. It often takes years to prepare for success, there are no overnight successes. What appears to be overnight success is usually the result of at least 10 years of preparation.

2. Get Started

“What is not started today is never finished tomorrow.” - Johann Wolfgang von Goethe
If you’re not in action today, you don’t have a tomorrow, just a longer today. So get into action now, and begin to move in the right direction.

3. Move in the Right Direction

“The great thing in the world is not so much where we stand, as in what direction we are moving.” -Oliver Wendell Homes
Are you moving in the right direction?
If you’re moving in the right direction, no matter your speed, you will eventually get to your intended destination. It’s not that important where you are right now, what matters is where you’re headed. Don’t get discouraged because you haven’t arrived; it’s only a matter of time before you walk into your dream.

4. Dream and Act

“To accomplish great things, we must dream as well as act.” - Anatole France
What you dream today will become your tomorrow…if after you finish dreaming it you wake up and turn it into a reality. Dreaming is necessary, it frames your thinking, but it’s not enough. You need to develop a step-by-step action plan to turn those dreams into reality.

5. Think Big

“The greater danger for most of us lies not in setting our aim too high and falling short; but in setting our aim too low, and achieving our mark.” - Michelangelo
Think bigger! If I have a little cup, I can fill it with a little water; if I have a big cup, I can fill it with a lot of water. Your thinking is the cup that determines what you get out of life. Expand your thinking and you will expand your life.

6. Grow

“We are all faced with a series of great opportunities brilliantly disguised as impossible situations.” -Charles Swindoll
Life is about growth. The challenges of life, the seeming impossibilities are really just opportunities for you to grow. You need these challenges; how can you grow without a challenge? The challenges make you stronger, they make you better.

7. Be Determined

“The surest way not to fail is to determine to succeed” - Richard Brinsley Sheridan
Og Mandino said, “Failure will never overtake me if my determination to succeed is strong enough.” Are you determined to succeed? Have you made up your mind? When you decide to succeed, when you cut-off all other options, when you’re determined to succeed, you will find a way to do it. So stay focused, success will be yours.